ఇమ్మాన్యుయెల్‌ ప్లాన్‌కి చిత్తైపోయిన సంజనా.. రీతూ టాలెంట్‌కి బిగ్‌ బాస్‌ ఫిదా

Published : Dec 02, 2025, 11:57 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 మంగళవారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇమ్మాన్యుయెల్‌ వేసిన ఎత్తుకి సంజనా చిత్తైపోయింది. రీతూ మ్యాథ్స్ టాలెంట్‌కి బిగ్‌ బాస్‌ ఫిదా అయ్యాడు. 

PREV
16
టికెట్ టూ ఫినాలే టాస్క్ లు

బిగ్‌ బాస్‌ తెలుగు 9 మంగళవారం ఎపిసోడ్‌లో టికెట్‌ టూ ఫినాలే టాస్క్ లు నిర్వహిస్తున్నాడు బిగ్‌ బాస్‌. ఈ టాస్క్ ల్లో విన్‌ అయిన కంటెస్టెంట్‌ డైరెక్ట్ గా ఫైనల్‌కి వెళ్తాడు. ఈ క్రమంలో వరుసగా టాస్క్ లు ఇస్తున్నారు. అందులో భాగంగా మొదట ముగ్గురుని ఎంపిక చేసి, వారికి టాస్క్ లు ఇచ్చారు. ఇందులో హౌజ్‌ నిర్ణయం ప్రకారం రీతూ చౌదరీ, కళ్యాణ్‌, ఇమ్మాన్యుయెల్‌ ఆడారు. వీరు ముగ్గురికి `కనుక్కోండి చూద్దాం` అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో లెక్కలతో కార్డులు ఉంటాయి. అవి ప్లస్‌, మైనస్‌లతో ఉంటాయి. బిగ్‌ బాస్‌ చెప్పిన నెంబర్స్ ని కనుక్కోవాలి. ఎవరు ఎక్కువ నెంబర్లని కనిపెడితే వాళ్లే ఫస్ట్ రౌండ్‌లో విన్నర్‌. ఇందులో ఎక్కువగా కనిపెట్టి ఇమ్మాన్యుయెల్‌ విన్‌ అయ్యాడు.

26
రీతూ చౌదరీ టాలెంట్‌కి బిగ్‌ బాస్‌ ఫిదా

అయితే రీతూ చౌదరీకి కనీసమైన లెక్కలు కూడా రాకపోవడం గమనార్హం. ఆమె లెక్కల టాలెంట్‌కి బిగ్‌ బాస్‌ పరీక్ష పెట్టాడు. కొన్ని బాగానే చెప్పింది. మరికొన్నింటికి ఆమె సమాధానం ఆశ్చర్యపోయేలా ఉంది. దీంతో ఇది చూసి బిగ్ బాస్‌ కూడా షాక్‌ అయ్యాడు. ఆమెని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. ఈ టాస్క్ లో పాల్గొంటా అని కంటెస్టెంట్లతో గొడవ పెట్టుకుని వచ్చి మరీ కనీసం ఒక్కటి కూడా కనిపెట్టలేక జీరోతో ఓడిపోయింది రీతూ చౌదరీ. దీంతో హౌజ్‌లో నవ్వులపాలయ్యింది.

36
సంజనా కి ఓటమి, కన్నీళ్లు

ఆ తర్వాత మొదటి రౌండ్‌లో విన్నర్‌ అయిన ఇమ్మాన్యుయెల్‌ తన బాక్స్ ని విస్తరించుకుంటూ వెళ్లాడు. రెండో రౌండ్‌లో ఆయన సంజనాతో పోటీపడ్డాడు. నేను ఓడిపోతే నీ బాక్సెస్‌ విస్తరిస్తాయని చెప్పి, సంజనాకి ఇష్టం లేకపోయినా ఈ టాస్క్ లో ఆడేలా చేశాడు ఇమ్మాన్యుయెల్‌. బాల్‌ టాస్క్ లు ఆడారు. ఇందులో సంజనా ఓడిపోయింది. ఇమ్మాన్యుయెల్‌ గెలిచాడు. మరో బాక్స్‌ని విస్తరించుకున్నాడు. అయితే తాను ఓడిపోవడం పట్ల సంజనా కన్నీళ్లు పెట్టుకుంది. 

46
ఇమ్మాన్యుయెల్‌ ప్లాన్‌కి సంజనా ఔట్‌

ఇందులో సంజనాతో అయితే ఈజీ అవుతుందని, ఆమెని ఎంచుకున్నాడు ఇమ్మాన్యుయెల్‌. తాను ఊహించినట్టుగానే ఆమె ఓడిపోయి రెండు టాస్క్ లు గెలవగలితాడు ఇమ్మాన్యుయెల్‌. ఫినాలే రేసులో ముందున్నాడు.

56
మూడో రౌండ్‌లో తనూజ విజయం

మూడో రౌండ్‌లో భరణి, తనూజ, డీమాన్‌ పవన్‌ ఆడారు. ఇందులో ల్యాండ్‌లో ఫ్లవర్స్ ని నాటాల్సి ఉంటుంది. ఇది రసవత్తరంగా సాగింది. అంతిమంగా తనూజ విన్ అయ్యింది. అయితే ఆమెని ఓడించేందుకు డీమాన్‌ పవన్‌ చాలా ప్రయత్నించాడు. కానీ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. చివరికి తను ఒక్కటే పెట్టాడు. తనూజ 59 ఫ్లవర్స్ పెట్టి విన్‌ అయ్యింది. నెక్ట్స్ ఆమె సుమన్‌ శెట్టితో టాస్క్ ఆడబోతుంది.

66
తెరవెనుక ప్లాన్స్

ఇదిలా ఉంటే షో దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎవరి గేమ్‌ వాళ్లు ఆడుతున్నారు. ప్లాన్స్ తో దూసుకుపోతున్నారు. తనూజ తనపై నామినేషన్‌లో అరవడంపై ఇమ్మాన్యుయెల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫ్రెండ్‌ అయితే నామినేట్‌ చేయోద్దా ఏంటి? అంటూ ప్రశ్నించాడు. అలాగే ఈ టికెట్‌ టూ ఫినాలేకి సుమన్‌ శెట్టి, భరణి ప్లాన్స్ వేసుకున్నారు. ఇమ్మాన్యుయెల్‌, కళ్యాణ్‌, డీమాన్‌లతో పోటీలోకి వెళ్లొద్దని మాట్లాడుకున్నారు. ఇంకోవైపు సుమన్‌ శెట్టి ఇప్పుడు సైలెంట్‌గా ఉంటాడు, చివర్లో ఆడతాడని, అది అతని గేమ్‌ స్ట్రాటజీ అని ఇమ్మాన్యుయెల్‌, పవన్‌, రీతూ మాట్లాడుకోవడం విశేషం. ఇలా ఎత్తులకుపై ఎత్తులతో ఈ మంగళవారం షో ఆసక్తికరంగా సాగిందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories