
బిగ్ బాస్ తెలుగు 9 30వ రోజు(మంగళవారం) ఎపిసోడ్‌లో ఆద్యంతం ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కంటెస్టెంట్లు చాలా ఫ్రీ అయ్యారు. సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇమ్మాన్యుయెల్ కామెడీ ఆద్యంతం నవ్వులు పూయించింది. దీంతోపాటు రెండు కఠినమైన టాస్క్ లు కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఒక టాస్క్ లో గట్టిగానే ఆడారు. కానీ రెండో టాస్క్ లో మాత్రం పౌల్ గేమ్ ఆడి బిగ్ బాస్ కోపానికి గురయ్యారు. అందులో భాగంగా ప్రారంభంలో సంజనా కోడిగుడ్లు తిన్నదని చెప్పి ఆమెకి ఫనీష్ మెంట్ ఇస్తారు. దీంతో ఆమె అంట్లు తోమే పనిలో బిజీగా ఉంటుంది. అయితే తనకు ఇలాంటి పనీష్‌మెంట్ ఇవ్వడంపై ఆమె సరదాగా ఏడవడం నవ్వులు పూయించింది.
ఆ తర్వాత అంతా కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. హౌజ్ నుంచి బయటకు వెళితే మొదట ఎవరిని కలుస్తారని మాట్లాడుకున్నారు. భరణి.. తనూజ, దివ్యలను కలుస్తానని తెలిపాడు. సుమన్ శెట్టి ఫ్లోరాని కలుస్తా అన్నాడు. ఈసందర్భంగా వీరిద్దరు సైలెంట్‌గా ఉంటారు, ఏం మాట్లాడుకుంటారని ఇమ్మాన్యుయెల్ సెటైర్లు వేశారు. కాఫీషాప్‌కి వెళితే ఎవరు ముందు ఆర్డర్ ఇస్తారని చెప్పడం నవ్వులు పూయించింది. ఈ క్రమంలో తనూజ తాను బయటకు వెళ్లగానే నాన్నని, మరో వ్యక్తిని కలుస్తానని తెలిపింది. ఆ తర్వాత అమ్మతో పోల్చుతూ ఇమ్ము అంటే ఇష్టమని తెలిపింది. దీంతో ఇమ్మాన్యుయెల్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇంకా రెండు నెలలు ఉంటే పడేస్తానని తెలపడం విశేషం. మరో సందర్భంలో అమ్మ కావాలి అని తనూజ బుంగమూతి పెట్టగా, ఏ ఊరుకో ఇప్పటికిప్పుడు అమ్మ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాడని భరణిని ఉద్దేశించి కామెంట్ చేశాడు ఇమ్మూ. నీకు మొగుడు కావాలంటే నేను వస్తానని చెప్పడం విశేషం. ఈ సందర్భంగా నవ్వులు విరిశాయి. అనంతరం తనూజ తనకు అమ్మ గుర్తుకు వస్తుందని ఎమోషనల్ అయ్యింది. ఇమ్మాన్యుయెల్ ఓదార్చాడు.
మరోవైపు సుమన్ శెట్టి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ఫ్యామిలీ గుర్తుకు వస్తుందని ఆయన ఎమోషనల్ అయ్యారు. దీంతో భరణి ఆయన్ని ఓదార్చారు. సుమన్ శెట్టి కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కలిచివేసింది. ఇందులో తనూజ, సుమన్ శెట్టి, సంజనా, శ్రీజ, రీతూ, దివ్య ఇలా అంతా కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు. హౌజ్‌ని ఎమోషనల్‌గా మార్చేశారు. మరోవైపు డేంజర్ జోన్‌కి సంబంధించిన టాస్క్ ఇచ్చే క్రమంలో బోర్డ్ పై జంటలుగా ఏర్పడిన వారి ఫోటోలను ఒక ఫ్లెక్సీలో పెట్టారు. కెప్టెన్సీ టాస్క్ లు ఇచ్చారు. మరోవైపు సుమన్ శెట్టి, శ్రీజ తమ ఆట గురించి మాట్లాడుకున్నారు. స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. వారిద్దరు కలిసి టాస్క్ లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ఫ్లెక్సీలోని ఫోటోలను ఉద్దేశించి ఇమ్మాన్యుయెల్ కాలేజీ ర్యాంక్‌లకు అన్వహించి చేసిన కామెడీ బాగా ఆకట్టుకుంది. హైలైట్‌గా నిలిచింది. సుమన్ శెట్టి, శ్రీజలను ఉద్దేశించి చేసిన ఈ కామెడీ ఆకట్టుకుంది.
ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే అని, ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయని, అందుకే జాగ్రత్తగా గేమ్ ఆడాలని తెలిపారు బిగ్ బాస్. మొదటి టాస్క్ లో తమ బాక్స్ లో ఇసుక పోయాల్సి ఉంటుంది. ఎక్కువ సేపు దాన్ని హోల్డ్ చేసిన వాళ్లు విన్నర్. ఇందులో డీమాన్ పవన్, రీతూ చౌదరీ విన్ అయ్యారు. ఆ తర్వాత భరణి రెండో స్థానంలో,కళ్యాణ్ మూడో స్థానంలో, సంజనా నాల్గో స్థానంలో, సుమన్ శెట్టి ఐదో స్థానంలో ఉన్నారు. ఈ టాస్క్ బాగానే ఆడారు.
ఇక రెండో టాస్క్ లో బెలూన్స్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అందరు పౌల్ గేమ్ ఆడారు. సంచాలకులు కూడా దాన్ని పట్టుకోలేకపోయారు. దీంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యారు. ఆటని అర్థం చేసుకోలేకపోయారని తెలిపారు. ఆట సరిగా ఆడకపోతే ఎలా అని ప్రశ్నించారు. డేంజర్ జోన్‌లో ఉంటారని హెచ్చరించారు బిగ్ బాస్. అవసరం ఉన్నప్పుడు దాని ప్రభావం కనిపిస్తుందన్నారు. మరోవైపు ఈ ఆదివారం వైల్డ్ కార్డ్స్ ద్వారా కంటెస్టెంట్లు రాబోతున్నట్టు వెల్లడించారు. వాళ్లు వస్తే మీరు డేంజర్‌లో ఉన్నట్టే అని తెలిపారు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్లు బిగ్ బాస్‌కి రిక్వెస్ట్ చేసుకున్నారు.