బీబీ రాజ్యంలో ప్రజల తిరుగుబాటు.. రాజులకు చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి

Published : Nov 13, 2025, 11:08 PM IST

బీబీ రాజ్యంలో ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు. ఇమ్మాన్యుయేల్ నేతృత్వంలో ప్రజా తిరుగుబాటు మొదలైంది. సుమన్ శెట్టి కూడా తిరుగుబాటులో ప్రధాన పాత్ర వహించారు. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో భాగంగా 67వ రోజు చాలా సరదాగా సాగింది. హౌస్ లో సెలెబ్రిటీ చెఫ్ సంజయ్ సందడి చేశారు. రాజులకు, కమాండర్లకు, ప్రజలకు తన కొత్త వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. హౌస్ మేట్స్ తో కాసేపు సరదాగా గడిపిన సంజయ్ ఆ తర్వాత బయటకి వెళ్లారు. అయితే రాజులు, రాణులు అయిన నిఖిల్, కళ్యాణ్, రీతూ లతో సమానంగా కమాండర్లు, ప్రజలకు విందు లభించలేదు. వీరు వేరుగా కూర్చుని భోజనం చేశారు. 

25
ప్రజల తిరుగుబాటు 

ఆ తర్వాత ప్రజలు అయిన ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, భరణి, గౌరవ్ తిరుగుబాటు మొదలు పెట్టారు. తమపై కమాండర్లు అధికారం చలాయించకూడదు అని, రాజులు తినే భోజనమే తమకు అందాలని డిమాండ్ చేశారు. దీనితో రాజులు కళ్యాణ్, నిఖిల్, రీతూ వారితో చర్చించి, సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలన్నీ చాలా సరదాగా సాగాయి. ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి.. రాజుల మాటలు వినకుండా వారికి చుక్కలు చూపించారు. 

35
ఇమ్మాన్యుయేల్ డిమాండ్లు 

తమతో చర్చలకు వచ్చిన రాజులతో ఇమ్మాన్యుయేల్ తన డిమాండ్లని బయట పెట్టాడు. కమాండర్లు చెప్పిన పనులు మేము చేయం, మా పనులు మేము చేసుకుంటాం అని తెలిపాడు. ఆ తర్వాత బిగ్ బాస్ రాజులు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి, కమాండర్లు రాజులుగా మారడానికి అవకాశం కల్పిస్తూ టాస్క్ ఇచ్చారు. 

45
దివ్య, తనూజ లకు ఛాన్స్ 

అయితే కమాండర్ల నుంచి ఎవరు పోటీలో ఉండాలి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కమాండర్లు అయిన దివ్య, పవన్, సంజన, తనూజ ప్రజలని తమకు అవకాశం ఇవ్వమని రిక్వస్ట్ చేశారు. ప్రజలంతా మాట్లాడుకుని దివ్య, తనూజ లకు అవకాశం ఇచ్చారు. వీరిద్దరిలో ఒకరు కళ్యాణ్ తో పోటీ పడాలి. ఆ ఒక్కరిని కళ్యాణ్ ఎంపిక చేసుకోవాలి. 

55
కళ్యాణ్ పై తనూజ విజయం 

ఈ క్రమంలో కళ్యాణ్ తనతో పోటీ పడేందుకు తనూజని ఎంపిక చేసుకున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కళ్యాణ్ విజయం సాధిస్తే అతడి రాజు స్థానం అతడికి దక్కుతుంది. అదే విధంగా కెప్టెన్సీ కంటెండర్ గా ఛాన్స్ ఉంటుంది. తనూజ విజయం సాధిస్తే మహారాణిగా అవకాశం దక్కుతుంది. ఈ టాస్క్ ప్రకారం కొన్ని క్యూబ్స్ ని అడ్డంకులు దాటుకుంటూ ఒక చోట అమర్చాలి. ఒకే కలర్ వరుసగా రెండుసార్లు రాకూడదు అని బిగ్ బాస్ నిబంధన పెట్టారు. ఈ టాస్క్ లో క్యూబ్స్ ని తనూజ, కళ్యాణ్ వేగంగా అమర్చారు. కానీ చివరికి తనూజ విజయం సాధించింది. మహారాణిగా అవకాశం దక్కించుకుంది. 

Read more Photos on
click me!

Recommended Stories