శ్రేష్టి వర్మ పేరు గతంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడంతో ఆమె హాట్ టాపిక్ అయ్యింది. అయితే, బిగ్ బాస్ 9 తెలుగు వేదిక ద్వారా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. మొదటి వారంలోనే ఎలిమినేట్ కావడంతో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు.
ఆమె ఓటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచే శ్రష్టి వర్మ తక్కువ ఓట్లు పొందిందన్న టాక్ వినిపించింది. మొదటి వారం ఆమె పెద్దగా హైలైట్ కాలేదు. హౌస్‌మేట్స్‌తో సరైన ఇంటరాక్షన్ లేకపోవడం, గేమ్‌లో పట్టు చూపించకపోవడంతో ఆమె ఓటింగ్‌లో వెనుకబడింది. ఫలితంగా తొలిగానే బిగ్ బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది.
ఈ సీజన్ ఆరంభం నుంచే మంచి హైప్ క్రియేట్ అయింది. నాగార్జున హోస్ట్‌గా తన స్టైల్‌తో ఆకట్టుకుంటున్నారు. మొదటి వారం నుంచే వివాదాలు, టాస్కులు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఆశ్చర్యకరంగా ఈ వారం సంజనా గల్రానీ కి కెప్టెన్సీ అవకాశం వచ్చింది. మొదట ఆమె ఎలిమినేట్ అవుతుందన్న ప్రచారం నడిచినా, ఇప్పుడు కెప్టెన్ కావడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా శ్రష్టి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతున్నదని టాక్.
నోట్ .. సోషల్ మీడియా పోస్టులు ఆధారంగా ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అధికార ప్రకటన కోసం మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.