ఎలిమినేషన్‌లో పెద్ద ట్విస్ట్.. రెండో వారం బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌ నుంచి ఆ కంటెస్టెంట్‌ ఔట్ ?

Published : Sep 20, 2025, 05:32 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 రెండో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన ఆసక్తికర విషయం వినిపిస్తోంది. ప్రియా ఎలిమినేట్‌ అవుతుందన్నారు. కానీ మనీష్‌ హౌజ్‌ని వీడుతున్నాడట. 

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 రెండో వారం ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ రెండో వారం ముగింపుకి చేరుకుంది. మొదటి వారం డల్‌గా సాగినా, రెండో వారం మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్‌గానే షో నడుస్తోంది. అయితే ఇందులో పులిహోర వ్యవహారాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకోవడం, గ్రూపు రాజకీయాలు నడిపించడం ఎక్కువగా నడుస్తోంది. అదే సమయంలో రీతూ లవ్‌ ట్రాక్‌లు కూడా ఇంట్రెస్టింగ్‌ని క్రియేట్‌ చేస్తున్నాయి. అదే సమయంలో వాంటెడ్‌గా చేస్తున్నట్టుగానే ఉంది. ఇక ఎలిమినేషన్‌కి సంబంధించి మొదటి వారం శ్రష్టి వర్మ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. రెండో వారం ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

25
రెండో వారం నామినేషన్‌లో ఉన్నది వీరే

రెండో వారానికి సంబంధించి ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. భరణి, మర్యాద మనీష్‌, హరిత హరీష్‌, ప్రియా, డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి, ఫ్లోరా సైనీ ఈ వారం ఎలిమినేషన్‌ కోసం నామినేట్‌ అయ్యారు. అయితే వీరిలో ఎవరు సేఫ్‌ అవుతారు, ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. నిన్నటి(శుక్రవారం) వరకు వచ్చిన ఓటింగ్‌ ప్రకారం సుమన్‌ శెట్టి టాప్‌లో ఉన్నాడు. అలాగే భరణి, డీమాన్‌ పవన్‌, ఫ్లోరా సైనీలకు మంచి ఓటింగ్‌ పడుతుంది. హరీష్‌ సైతం ఓటింగ్‌లో దూసుకుపోతున్నాడు. ఆయనపై సింపతీ వర్కౌట్‌ అయినట్టుగా అనిపిస్తోంది.

35
ప్రియా ఎలిమినేషన్‌లో ట్విస్ట్

ఇక రెండో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన అనూహ్యమైన ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. రెండో వారంలో మొదట ప్రియా ఎలిమినేట్‌ అవుతుందని భావించారు. సోషల్‌ మీడియాలో అదే ప్రచారం జరిగింది. ప్రారంభం నుంచి ఆమె ఓటింగ్‌లో వెనకబడుతూ వచ్చింది. దీంతో ఈ వారం ఆమె ఎలిమినేషన్‌ పక్కా అని భావించారు. ఆల్మోస్ట్ ఎలిమినేట్‌ అనే అంతా అనుకున్నారు. కానీ చివరి రోజు ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

45
మర్యాద మనీష్‌ ఎలిమినేట్‌

రెండో వారం మర్యాద మనీష్‌ ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తోంది. మనీస్‌ కూడా డేంజర్‌ జోన్లో ఉంటూ వచ్చాడు. చివరి రోజు ప్రియాకి ఎక్కువ ఓటింగ్‌ నమోదైందని, ఆమె బాటమ్‌ నుంచి రెండో స్థానానికి వెళ్లగా, మనీష్‌ చివరికి పడిపోయాడు. దీంతో రెండో వారం ఎలిమినేషన్‌ ఆయనే తెలుస్తోంది. చివరి నిమిషంలో ట్విస్ట్ తో మనీష్‌ ఎలిమినేషన్‌లోకి వచ్చినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

55
శ్రీముఖి కష్టం అంతా వృథా

ఇక 15 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్‌ 7న బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 9 ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో 9 మంది సెలబ్రిటీలు రాగా, ఆరుగురు కామనర్స్ హౌజ్‌లోకి వచ్చారు. అయితే మనీష్‌ మొదట కంటెస్టెంట్‌గా రాలేదు. శ్రీముఖి చివరి నిమిషంలో వచ్చి ఆయన్ని ఎంపిక చేయాలని రిక్వెస్ట్ చేసింది. బిగ్‌ బాస్‌ అగ్నిపరీక్షకి జడ్జ్ గా ఉన్న అభిజీత్‌ కోరిక కూడా అని చెప్పింది. వారి కోరిక మేరకు హోస్ట్ నాగ్‌ మనీష్‌ని చివరి కంటెస్టెంట్ గా ఎంపిక చేశారు. ఇప్పుడు ఆయన రెండో వారమే హౌజ్‌ని వీడుతుండటం గమనార్హం. దీంతో శ్రీముఖి కష్టం అంతా వృథా అని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories