వీరాభిమన్యులో శోభన్ బాబుకి ఛాన్స్ ఇచ్చి ఎన్టీఆర్ ఏమన్నారో తెలుసా.. ఆ మహానుభావుడికే సాధ్యం అంటూ

Published : Sep 20, 2025, 04:09 PM IST

శోభన్ బాబుకి కెరీర్ బిగినింగ్ లో గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం వీరాభిమన్యు. టైటిల్ రోల్ లో శోభన్ బాబు నటించగా.. శ్రీ కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ నటించారు.ఈ మూవీలో శోభన్ బాబుకి ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చి ఒక మాట అన్నారు. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
వీరాభిమన్యుగా శోభన్ బాబు 

శోభన్ బాబు ఇండస్ట్రీకి వచ్చి సృగుల్ అవుతున్న టైంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారు సపోర్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని శోభన్ బాబు పలు సందర్భాల్లో తెలిపారు. శోభన్ బాబుకి కెరీర్ బిగినింగ్ లో గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం వీరాభిమన్యు. మహాభారతం నేపథ్యంలో అభిమన్యుడి పాత్రని హైలైట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. 1965లో ఈ చిత్రం విడుదలయింది. అద్భుతమైన విజయం సాధించింది. 

25
ఎన్టీఆర్ వల్లే అవకాశం 

టైటిల్ రోల్ లో శోభన్ బాబు నటించగా.. శ్రీ కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఈ మూవీలో శోభన్ బాబు అభిన్యుడిగా నటించారు కాబట్టి ఆ పాత్రకి ప్రాధానత్య ఎక్కువగా ఉంటుంది. దీని గురించి శోభన్ బాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ భోళా శంకరుడు అని ఊరికే అనరు. ఆయన మహానుభావుడు. ఒక అగ్ర హీరో నటిస్తున్న సినిమాలో చిన్న హీరోకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఎవ్వరూ అంగీకరించరు. 

35
దంచేయండి బ్రదర్ 

కానీ ఎన్టీఆర్ గారు నా కోసం ఆ పని చేశారు. అభిమన్యుడు లాంటి కీలకమైన పాత్రని నాకు ఇచ్చారు. ఆ చిత్రంతో నాకు చాలా గుర్తింపు దక్కింది. ఎన్టీఆర్ గారు రికమండ్ చేయడం వల్లే ఆ పాత్ర నాకు వచ్చింది. ఆ పాత్రని ఇప్పించడం మాత్రమే కాదు.. కమాన్ బ్రదర్.. దంచేయండి అని ప్రోత్సహించినట్లు శోభన్ బాబు గుర్తు చేసుకున్నారు. 

45
ఎన్టీఆర్ తో పలు చిత్రాల్లో నటించిన శోభన్ బాబు 

అంతటి గొప్ప హృదయం ఎన్టీఆర్ గారికి మాత్రమే చెల్లింది. ఆ తర్వాత ఎన్టీఆర్, శోభన్ బాబు కలసి పలు చిత్రాల్లో నటించారు. 60 వ దశకం ముగిసే వరకు శోభన్ బాబుకి ఇండస్ట్రీలో ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. 

55
శోభన్ బాబు కెరీర్ మారిపోయింది

 70వ దశకం ప్రారంభం నుంచి శోభన్ బాబు కెరీర్ మారిపోయింది. ఆయన నటించిన పలు చిత్రాలు విజయం సాధించడంతో శోభన్ బాబు అగ్ర నటుల జాబితాలో చేరిపోయారు. 

Read more Photos on
click me!

Recommended Stories