హౌస్ నుంచి వెళ్ళిపోతా, ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు.. నాగార్జునకి చుక్కలు చూపించిన సంజన

Published : Nov 29, 2025, 11:19 PM IST

బిగ్ బాస్ తెలుగు 9 షోలో 83వ రోజు చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రీతూ, సంజన వివాదంలో నాగార్జున సీరియస్ అయ్యారు. దీనితో హౌస్ నుంచి వెళ్లిపోవడానికి కూడా సంజన సిద్ధపడింది. చివరికి నాగార్జున ఆమెని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 షోలో 83వ రోజు ఎక్కువగా రీతూ, సంజన వివాదం చుట్టూనే సాగింది. ఈవారం జరిగిన ఎపిసోడ్స్ లో సంజన.. రీతూ, పవన్ రాత్రి వేళల్లో అంటి కూర్చోవడం తనకి చాలా ఇబ్బందిగా ఉంది అంటూ స్టేట్మెంట్ పాస్ చేశారు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో కూడా ఈ వివాదం కొనసాగింది. పవన్ తో ప్యాచప్ చేసుకోవడం తప్ప రీతూ గేమ్ ఆడిందే లేదు అంటూ సంజన అన్నారు. 

25
వెనక్కి తగ్గని సంజన 

శనివారం రోజు ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. సంజన విషయంలో ఆగ్రహానికి గురయ్యారు. సంజన, రీతూ వివాదం పైనే ఎక్కువ టైం చర్చ కొనసాగించారు. ఈ క్రమంలో కొన్ని సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంటి సభ్యులంతా సంజనదే తప్పు అని చెప్పారు. ఇంట్లో చాలా కెమెరాలు ఉన్నాయి. ఏదీ సీక్రెట్ కాదు. కాబట్టి నేను చూసింది, నాకు అనిపించిందే చెప్పాను. అందులో తప్పు ఏముంది అంటూ సంజన నాగార్జునకి వివరణ ఇచ్చింది. నాగార్జున ఎంతలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని సంజన పేర్కొంది. 

35
హౌస్ నుంచి వెళ్ళిపోతా 

రీతూ, పవన్ రాత్రి కూర్చుని మాట్లాడుకోవడం తప్పు అయితే.. నువ్వు రాత్రి వేళలో ఇమ్మాన్యుయేల్ కి ఆయిల్ రాయడం తప్పు కదా అని నాగార్జున ప్రశ్నించారు. నువ్వు చేసిన పని రీతూ, పవన్ ల క్యారెక్టర్ అశాసినేషన్ చేయడమే అని నాగార్జున అన్నారు. నీకు ఇబ్బందిగా ఉంటే హౌస్ గేట్లు ఓపెన్ చేస్తాను వెళ్లిపోవచ్చు అని అన్నారు. నువ్వు హౌస్ లో ఉండాలా, వెళ్లిపోవాలా అనేది భరణి, ఇమ్మాన్యుయేల్, తనూజ డిసైడ్ చేస్తారు అని నాగార్జున చెప్పగానే.. సంజన బాగా హర్ట్ అయింది. వాళ్ళ దయ దాక్షిణ్యాలతో హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదని.. గేట్లు తెరిస్తే వెళ్లిపోతానని.. మనస్ఫూర్తిగా ఈ విషయం చెబుతున్నాను అని సంజన పేర్కొంది. 

45
డెసిషన్ వాళ్ళకి వదిలేసిన నాగార్జున 

తాను హౌస్ నుంచి వెళ్ళిపోతాను అని సంజన పదేపదే చెప్పింది. సెకను కొకసారి నీ ఆలోచన ఛేంజ్ చేసుకుంటాను అంటే ఇక్కడ కుదరదు. బిగ్ బాస్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి అని నాగార్జున ఫైర్ అయ్యారు. ఇంతలో ఇమ్మాన్యుయేల్, భరణి,తనూజ కలసి.. సంజన గారు రీతూకి, బిగ్ బాస్ కి, ఆడియన్స్ కి సారీ చెబితే హౌస్ లో కొనసాగవచ్చు అని నిర్ణయించారు. దానికి కూడా సంజన అంగీకరించలేదు. తన మనసు చంపుకుని ఇక్కడ ఉండలేను అని సంజన నాగార్జునకి చెప్పేసింది. హౌస్ లో కొనసాగమని చివరికి నాగార్జునే ఆమెని రిక్వస్ట్ చేసే పరిస్థితి ఏర్పడింది. 

55
రీతూ పరువు తీసేలా.. 

చివరికి సంజన ప్రేక్షకులకు, రీతూకి సారీ చెప్పడంతో వివాదం ముగిసింది. ఆ తర్వాత నాగార్జున.. కళ్యాణ్, పవన్, రీతూ లకు క్లాస్ పీకారు. ప్రతిసారీ రీతూ పవన్ తరుపున మాట్లాడుతుండడం.. ఫైర్ అయ్యారు. పవన్ తరుపున మాట్లాడుతున్నావ్ నువ్వేమైనా అతడికి లాయర్ వా అని పరువు తీశారు. కుర్చీ విసిరికొట్టినందుకు కళ్యాణ్ ని కూడా మందలించారు. 

Read more Photos on
click me!

Recommended Stories