బిగ్ బాస్ హౌస్ లో సంజన కథ ముగిసిందా ? నాగార్జున షాకింగ్ డెసిషన్

Published : Nov 29, 2025, 08:12 PM IST

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 షోలో సంజన తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆమె హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే ప్రమాదం కూడా ఏర్పడింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోంది. గత వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారు. గతవారం దివ్య ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్ర ఉపయోగించి ఎలిమినేషన్ జరగకుండా అడ్డుకున్నాడు. దీనితో ఎలిమినేషన్ క్యాన్సిల్ అయింది. లేకుంటే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం దివ్య ఎలిమినేట్ అయ్యేది. దీనితో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తో హీట్ పెంచబోతున్నారు. ఆల్రెడీ హౌస్ నుంచి దివ్య ఎలిమినేట్ అయింది. దీనికి సంబంధించిన లీకులు వస్తున్నాయి. ఇక నాగార్జున శనివారం లేదా ఆదివారం దివ్య ఎలిమినేషన్ ని అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలింది. దివ్య ఓటింగ్ లో లీస్ట్ లో ఉండడంతో ఆమె ఎలిమినేషన్ తప్పలేదు.

25
రీతూపై సంజన కామెంట్స్

డబుల్ ఎలిమినేషన్ లో దివ్య తర్వాత సంజన, సుమన్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంజన కనుక ఎలిమినేట్ అయితే.. సుమన్ శెట్టి సేవ్ అవుతారు. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు 9 చివరి అంకానికి చేరుకుంది. సంజన ఈ వారం కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పవన్, రీతూ రిలేషన్ పై ఆమె ఊహించని విధంగా నోరు జారింది. రాత్రి వేళల్లో రీతూ పవన్ తో అంటి కూర్చుంటోంది అంటూ వ్యాఖ్యలు చేసింది.

35
హౌస్ మొత్తాన్ని డిస్టర్బ్ చేశారు

రీతూ పట్ల సంజన వ్యక్తిగత కామెంట్స్ చేయడాన్ని ఇతర హౌస్ మేట్స్ అంతా ఖండించారు. శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఊహించినట్లుగానే నాగార్జున సంజనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సంజన గారు రీతూ పై చేసిన వ్యాఖ్యలు హౌస్ మొత్తాన్ని డిస్టర్బ్ చేశాయి అని ఇమ్మాన్యుయేల్ అన్నారు.

45
వివరణ ఇచ్చిన సంజన

ఈవిడ ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని తాను షాక్ అయినట్లు పవన్ నాగార్జునకు తెలిపారు. దీనికి సంజన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. నాకు అనిపించింది, ఇబ్బంది కరంగా ఫీలైన విషయాన్ని చెప్పడంలో తప్పేముంది సార్ అని సంజన నాగార్జునని అడిగారు. వాళ్లిద్దరూ పక్క పక్కన ఆ విధంగా కూర్చోవడం తనకి ఇష్టం లేదు అని సంజన ఓపెన్ గా చెప్పింది.

55
హౌస్ నుంచి వెళ్ళిపోమన్న నాగార్జున

రీతూ విషయంలో ఒకలా ఉన్నావు, తనూజ విషయంలో మరోలా ఉన్నావు ఎందుకు అని నాగార్జున ప్రశ్నించారు. రీతూ, పవన్ ల రిలేషన్ సంజన మాదిరిగానే ఇంకెవరికైనా ఇబ్బందిగా అనిపించిందా అని నాగార్జున ప్రశ్నించారు. అందరూ లేదు అని సమాధానం ఇచ్చారు. హౌస్ లో ఎవరికీ ఇబ్బంది లేదు.. నీకు మాత్రమే ఎందుకు కలిగింది ? ఇది స్పష్టంగా రీతూ, పవన్ ల క్యారెక్టర్ అసాసినేషన్ గానే భావించాలి. బిగ్ బాస్ హౌస్ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు నువ్వు ఇప్పుడే హౌస్ నుంచి వెళ్లిపోవచ్చు.. గేట్లు ఓపెన్ చేస్తున్నా అంటూ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories