ఎట్టకేలకు వెంకటేష్ కోరిక నెరవేరబోతోంది. వెంకీ, విజయ భాస్కర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
తెలుగు ప్రేక్షకులు బుల్లితెరపై అత్యధికంగా చూసిన సినిమాల జాబితాలో నువ్వు నాకు నచ్చావ్ కూడా ఉంటుంది. ఈ సినిమా చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. మీమ్స్ లో ఈ సినిమా సీన్లే ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. దీనితో నువ్వు నాకు నచ్చావ్ మేకర్స్ కూడా మరోసారి ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.
25
రీ రిలీజ్ అవుతున్న నువ్వు నాకు నచ్చావ్
2026 జనవరి 1న ఈ చిత్రం గ్రాండ్ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా, యూరప్ లలో కూడా నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఎట్టకేలకు వెంకటేష్ కోరిక నెరవేరబోతోంది. సైంధవ్ మూవీ ప్రమోషన్స్ సమయంలో తనకి నువ్వు నాకు నచ్చావ్ మూవీ రీ రిలీజ్ కావాలని ఉన్నట్లు వెంకీ మనసులో కోరిక బయట పెట్టారు.
35
త్రివిక్రమ్ డైలాగులు
విజయ భాస్కర్ దర్శకత్వంలో, త్రివిక్రమ్ రచయితగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో దాదాపుగా ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్ ఆడియన్స్ కి గుర్తుండిపోతుంది. వెంకటేశ్వర్లు(వెంకీ)గా వెంకటేష్ చేసిన అల్లరి, నందు పాత్రలో ఆర్తి అగర్వాల్ గ్లామర్, ప్రకాష్ రాజ్ తో కామెడీ సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్స్. అదే విధంగా పింకీ పాత్రలో సుదీప, ఆశా పాత్రలో ఫ్లోరా షైనీ చేసిన రచ్చ కూడా అంతా ఇంతా కాదు. త్రివిక్రమ్ రాసిన డైలాగులు, ఫన్నీ వన్ లైనర్స్ ఈ చిత్రంలో మరో హైలైట్.
ఈ రీ రిలీజ్ తో వీరందరి పెర్ఫార్మెన్స్ ని వెండితెరపై మరోసారి చూసే అవకాశం ఆడియన్స్ కి దక్కింది. నువ్వు నాకు నచ్చావ్ 2001లో విడుదలై సంచలన విజయం సాధించింది. వెంకీ కెరీర్ లో ఇది మరచిపోలేని చిత్రంగా నిలిచిపోయింది.
55
ఇన్నేళ్ల తర్వాత వెంకీ, త్రివిక్రమ్ కాంబో
శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ లో స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో సునీల్, బ్రహ్మానందం, సుధ, హేమ, ఎమ్మెస్ నారాయణ ఇతర పాత్రల్లో నటించారు. నువ్వు నాకు నచ్చావ్ రిలీజైన 24 ఏళ్ళ తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ రాబోతోంది.