ఫైనల్ కి వెళ్లే ఆ ఇద్దరు ఎవరో తెలిసిపోయింది, హింట్ ఇచ్చేసిన నాగార్జున.. భరణికి తప్పిన గండం

Published : Nov 09, 2025, 10:58 PM IST

ఆల్రెడీ ఎలిమినేట్ అయి హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన భరణికి మరోసారి ఎలిమినేషన్ గండం తప్పింది. సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యారు. తనూజ వల్ల భరణి సేఫ్ అయ్యారు. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాక సండే రోజు మరో ఎలిమినేషన్ జరిగింది. వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యారు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సాయి శ్రీనివాస్ బాటమ్ లో ఉండడంతో ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం రెబల్స్ గా రాణించిన దివ్య, సుమన్ శెట్టి చేసిన దొంగతనం అల్లరి గురించి నాగార్జున మాట్లాడారు. ఆ వీడియోల్ని ప్లే చేశారు. 

25
సుమన్ శెట్టి నటనకి ఫిదా 

సుమన్ శెట్టికి ఆ వీడియోల ద్వారా ఒక రేంజ్ లో ఎలివేషన్ లభించింది. పాల ప్యాకెట్స్ దొంగతనం చేసిన తర్వాత సుమన్ శెట్టి అమాయకంగా నటించడం, హౌస్ మేట్స్ అందరినీ ఫూల్స్ చేసిన విధానం గమ్మత్తుగా ఉంది. ఆ తర్వాత నాగార్జున ఒక్కొక్కరినీ పిలిచి బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ గెలిచేందుకు ఎవరు చేరువగా ఉన్నారు ? ఎవరు ఎలిమినేషన్ కి దగ్గర్లో ఉన్నారు ? అనేది చెప్పమని అడిగారు. 

35
టైటిల్ కి దగ్గరవుతున్నది వారే 

ఈ క్రమంలో ఇంటి సభ్యులు అంతా తమ అభిప్రాయం చెప్పారు. ఈ క్రమంలో ట్రోఫీకి చేరువగా ఉన్నారు అంటూ తనూజకి 5 ఓట్లు, ఇమ్మాన్యుయేల్ కి 5 ఓట్లు దక్కాయి. ఎలిమినేషన్ కి దగ్గర్లు ఉన్నది ఎవరు అనే విషయంలో భరణి, సాయి లకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇంటి సభ్యులు భావించినట్లుగానే సాయి ఎలిమినేట్ అయ్యారు. టైటిల్ కి దగ్గరవుతున్న వారిగా ఎక్కువ ఓట్లు పోయిందిన తనూజ, ఇమ్మాన్యుయేల్ లని నాగ్ అభినందించారు. 

45
ఇద్దరు ఫైనలిస్టులు ఎవరో తెలిసిపోయిందా ?

అంటే బిగ్ బాస్ తెలుగు 9 లో ఇద్దరు ఫైనలిస్టులు ఎవరో నాగ్ చెప్పకనే చెప్పేశారు అని.. హింట్ ఇచ్చేశారు అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇమ్మాన్యుయేల్, తనూజ ఇద్దరూ ఫైనల్ కి వెళ్లడం ఖాయం అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. 

55
భరణి బతికిపోయాడు, సాయి అవుట్ 

నామినేషన్స్ లో ఉన్నవారంతా సేఫ్ కాగా చివరికి సాయి, భరణి మిగిలారు. వారిద్దరూ గార్డెన్ ఏరియాలో నిలబడ్డారు. వారిద్దరి ముందు రెండు బొమ్మ ట్రైన్స్, టన్నెల్ లో రైల్వే ట్రాక్ సెటప్ ఉన్నాయి. ఎవరి ముందు ఉన్న ట్రైన్ టన్నెల్ నుంచి బయటకి రాకుండా ఆగిపోతుందో వారు ఎలిమినేట్ అయినట్లు అని నాగార్జున తెలిపారు. సాయి శ్రీనివాస్ ముందు ఉన్న ట్రైన్ ఆగిపోయింది. దీనితో నాగార్జున తనూజని పిలిచి.. తన వద్ద ఉన్న గోల్డెన్ బజర్ ఉపయోగించుకోవచ్చు. దానిని ఉపయోగిస్తే సాయి సేఫ్ అయి, భరణి ఎలిమినేట్ అవుతారు అని తెలిపారు. కానీ తనూజ గోల్డెన్ బజర్ ఉపయోగించడానికి అంగీకరించలేదు. దీనితో సాయి ఎలిమినేట్ కాక తప్పలేదు. ఇంటి సభ్యులు సాయికి సెండాఫ్ ఇచ్చారు. తనూజ గోల్డెన్ బజర్ ఉపయోగించకపోవడంతో భరణికి రెండోసారి ఎలిమినేషన్ గండం తప్పింది.

Read more Photos on
click me!

Recommended Stories