“శివ” రీ-రిలీజ్ సందర్భంగా చిరంజీవి చేసిన ప్రశంసలకు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ, గతంలో తన వ్యాఖ్యలతో చిరంజీవిని అనుకోకుండా నొప్పించినందుకు క్షమాపణలు తెలిపారు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ శివ సినిమాలో తన ఫిలిం మేకింగ్ శైలితో యావత్ దేశాన్ని ఆకర్షించారు. కానీ ఇటీవల వర్మ తన సినిమాల కంటే వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై సైతం వర్మ అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. కానీ ఎట్టకేలకు వర్మ చిరంజీవిని క్షమాపణ కోరారు.
25
శివ రీ రిలీజ్ పై చిరంజీవి రియాక్షన్
“శివ” చిత్రం రీ-రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఆ కాలంలో ఈ చిత్రం తెరపై చూసినప్పుడు కలిగిన అనుభూతిని వివరించారు. చిరంజీవి మాట్లాడుతూ, ఈ మూవీలో నాగార్జున గారి తీవ్రత, రాంగోపాల్ వర్మ చూపిన విప్లవాత్మక దృక్పథం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమాకి భవిష్యత్తు అని అప్పట్లోనే తాను అనుకున్నట్లు చిరంజీవి తెలిపారు.
35
చిరంజీవికి క్షమాపణ చెప్పిన వర్మ
మెగాస్టార్ నుండి వచ్చిన ఈ హృదయపూర్వక సందేశానికి రాంగోపాల్ వర్మ స్పందించారు. “గతంలో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు చిరంజీవి గారిని అనుకోకుండా నొప్పించి ఉంటే, దానికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుకుంటున్నాను. శివ సినిమా గురించి ఇంత అద్భుతంగా చెప్పినందుకు థాంక్యూ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
తెలుగు సినీ వర్గాల్లో ఈ పరిణామం విశేష చర్చనీయాంశంగా మారింది. గతంలో వర్మ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా రాజకీయ సంబంధిత అంశాలపై వచ్చిన ఆయన ట్వీట్లు, మెగా ఫ్యాన్స్‌లో ఆగ్రహానికి కారణమయ్యాయి. పలు సందర్భాల్లో వర్మ పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ లు పెట్టేవారు.
55
ప్రేక్షకుల్లో ఆసక్తి
“శివ” చిత్రం రీ-రిలీజ్ ప్రస్తుతం సినీప్రియులలో విపరీతమైన ఆసక్తిని రేపుతోంది. నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం 1989లో విడుదలై తెలుగు సినిమాకు సాంకేతిక, శైలి పరమైన కొత్త దారితీసింది. యూత్ యాక్షన్ డ్రామా జానర్‌లో అది చేసిన విప్లవాత్మక మార్పులు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంటాయి.