Dragon Update: ఎన్టీఆర్‌ చిన్నప్పుడు విన్న కథలను నిజం చేసిన రిషబ్‌ శెట్టి.. `డ్రాగన్‌` నుంచి క్రేజీ అప్‌ డేట్‌

Published : Sep 28, 2025, 09:37 PM IST

Jr Ntr: ఎన్టీఆర్‌ చిన్నప్పుడు విన్న కథలను రిషబ్‌ శెట్టి నిజం చేశాడు. ఈ విషయాన్ని తారక్‌ `కాంతారః చాప్టర్‌ 1` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వెల్లడించారు. అంతేకాదు `డ్రాగన్‌` అప్‌ డేట్‌ వెల్లడించారు. 

PREV
15
నొప్పితో బాధపడుతూ `కాంతారః చాప్టర్‌ 1` ఈవెంట్‌కి ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ ఇటీవల `వార్‌ 2`తో డిజప్పాయింట్‌ చేశారు. బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన `డ్రాగన్‌` మూవీపై ఫోకస్‌ పెట్టారు. తాజాగా ఎన్టీఆర్‌ `కాంతారః చాప్టర్‌ 1` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సందడి చేశారు. ఈ ఈవెంట్‌కి ఆయన గెస్ట్ గా హాజరయ్యారు. ఇటీవల ఎన్టీఆర్‌ గాయపడిన విషయం తెలిసిందే. ఓ యాడ్‌ చేస్తూ ఆయన స్టేజ్‌ మీద నుంచి కిందపడ్డారు. దీంతో వెన్నెముకకి, కుడిచేతికి మధ్య గాయమైంది. ఆ గాయంతోనే ఇబ్బంది పడుతూ `కాంతార 2` ఈవెంట్‌కి వచ్చారు ఎన్టీఆర్‌. ఈవెంట్లో కూర్చున్నప్పుడు, ఇబ్బంది పడుతూ కనిపించారు. నొప్పిగా ఉందని, ఎక్కువసేపు మాట్లాడలేనని ఆయన తెలిపారు.

25
ఎన్టీఆర్‌ చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథని నిజం చేసిన రిషబ్‌ శెట్టి

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ఎలాంటి హడావుడి లేకుండా రిషబ్‌ శెట్టి గురించి, తమ మధ్య అనుబంధం గురించి, కాంతారః చాప్టర్‌ 1 సినిమా గురించి తెలిపారు. అదే సమయంలో తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ చెప్పిన కథలను గుర్తు చేశారు. ఆ విషయాలను ఎన్టీఆర్‌ చెబుతూ, మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు నుంచే కొన్ని కథలు చెప్పడం మొదలు పెట్టింది. ఈ కథ నిజంగా జరుగుతుందా అని అప్పుడు అనుమానం కలిగేది. కానీ అవి బాగా నచ్చేవి. ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది. ఆ పింజుల్లి, గుడి ఘాట్ చిన్నప్పుడు నుంచి నాటుకు పోయింది. కానీ ఏనాడు అనుకోలేదు. చిన్నప్పుడు నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు సినిమా తీస్తాడని. అతను మరెవరో కాదు నా బ్రదర్ రిషబ్ శెట్టి` అని తెలిపారు ఎన్టీఆర్‌. చిన్నప్పుడు విన్న కథలను వెండితెరపై ఆవిష్కరించిన రిషబ్‌ శెట్టికి ఆయన థ్యాంక్స్ చెప్పారు.

35
రిషబ్‌ లేకపోతే అమ్మ కోరిక తీరేది కాదు

ఈ సందర్భంగా `కాంతార` మూవీ అనుభవాన్ని పంచుకుంటూ, `నేను చిన్నప్పుడు విన్న కథ(కాంతార) తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు. కథ తెలిసిన నేనే అంత ఆశ్చర్య పోతే ఆ కథ తెలియని వాళ్ళు చూసి ఏమయ్యారో అదే `కాంతార` రిజల్ట్. చాలా అరుదైన దర్శకుడు రిషబ్. 24 క్రాఫ్ట్ లో అన్ని క్రాఫ్ట్స్ ని ఆయన డామినేట్ చేయగలరు. రిషబ్ లేకపోతే నిజంగా ఈ సినిమాని ఈ లెవెల్ లో తీయగలిగేవారా అనిపిస్తుంది. ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్లాలని మా అమ్మ కోరిక. రిషబ్ లేకపోతే ఆ దర్శనం అలా అయ్యేది కాదు. ఆ భాగ్యం కలిగేది కాదు. పనులన్నీ మానుకొని కుటుంబ సభ్యులు లాగా మాతో వచ్చారు. సొంత కుటుంబ సభ్యులు లాగా చూసుకున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు కాంతార చాప్టర్ 1 కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో చూసే అవకాశం దొరికింది. ఈ సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఒక గుడికి తీసుకెళ్లారు. నిజానికి ఆ గుడికి వెళ్ళడానికి మార్గమే లేదు. అలాంటి మార్గాన్ని క్రియేట్ చేసుకున్నారు` అని ఎన్టీఆర్‌ చెప్పారు.

45
అక్టోబర్‌ 2న `కాంతారః చాప్టర్‌ 1`

`కాంతార` రిషబ్ శెట్టి డ్రీమ్. ఈ డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేయడానికి హోంబలే ఫిల్మ్స్ సపోర్ట్ చేశారు. ఇండియన్ ఫిలిమ్స్ లో ఒక గొప్ప బ్లాక్ బాస్టర్ చిత్రంగా ఈ చిత్రం ప్రస్ఫుటంగా కనబడాలని మనస్పూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను` అని తెలిపారు ఎన్టీఆర్‌. రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన `కాంతారః చాప్టర్‌ 1` చిత్రంలో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్‌ 2న ఈ మూవీ గ్రాండ్‌గా కన్నడ, తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీలో విడుదల కాబోతుంది.

55
`డ్రాగన్‌` మూవీ నుంచి క్రేజీ అప్‌ డేట్‌

ఈ ఈవెంట్‌లో `డ్రాగన్‌` మూవీ అప్‌ డేట్‌ ఇచ్చారు నిర్మాత రవిశంకర్‌. ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `డ్రాగన్‌` మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం గురించి రవి శంకర్‌ మాట్లాడుతూ, వచ్చే నెలలో షెడ్యూల్‌ స్టార్ట్ చేస్తున్నామని, గ్యాప్‌ లేకుండా సినిమాని పూర్తి చేయబోతున్నామని తెలిపారు. ముందుగా చెప్పిన డేట్ కి, అనుకున్న విధంగా సినిమాని పూర్తి చేసి రిలీజ్‌ చేస్తామని చెప్పారు. ఇక సినిమా అదిరిపోతుందని, ఎన్ని అంచనాలు పెట్టుకున్నా దాన్ని మించి ఉంటుందన్నారు. అదే సమయంలో `కాంతార 2` ఈవెంట్‌లో హీరోయిన్‌ రుక్మిణి వసంత్ మాట్లాడుతూ `డ్రాగన్‌`లో తాను హీరోయిన్‌ అనే విషయాన్ని కన్ఫమ్‌ చేసింది. ఇన్నాళ్లు రుక్మిణి హీరోయిన్‌ అనేది రూమర్‌గానే ఉంది. తాజాగా క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఎన్టీఆర్‌ గురించి ఆమె చెబుతూ, ఆయన డిక్షనరీ అని తెలపడం విశేషం.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories