చిరంజీవి ఇటీవల జాతీయ ఐక్యతా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కాలికి సంబందించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి కాలికి గాయం అయిందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో 24 వేలకు పైగా డ్యాన్స్ మూమెంట్స్ వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఇప్పటికీ 70 ఏళ్ళ వయసులో కూడా చిరంజీవి డ్యాన్స్ చేస్తున్నారు. దీనితో ఆయన పాదాలు ఎంతలా సహకరిస్తున్నాయో అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే చిరంజీవి కాలి గురించి దశాబ్దాలుగా ఒక రూమర్ ఉంది.
25
చిరంజీవి అప్పట్లో గాయం ?
ఆయన గూండా సినిమా సమయంలో స్టంట్ చేస్తూ గాయపడ్డారని.. ఆ కాలి గాయం ఇంకా అలాగే ఉందని చెబుతుంటారు. అయితే ఇది జనాల్లో ఉన్న రూమర్ మాత్రమే దీని గురించి చిరంజీవి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో కూడా తెలియదు.
35
చిరంజీవి వీడియో వైరల్
అయితే ఇటీవల చిరంజీవి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీసులు నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కి చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా వ్యాయామాలు చేసి అందరినీ ప్రోత్సాహించారు. ఈ క్రమంలో చిరంజీవి పాదం కనిపించింది. చిరంజీవి పాదం నార్మల్ గా లేదు. గాయం అయినట్లుగ్గా ఉంది.
దీనితో నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అది చాలా ఏళ్ళ క్రితం అయిన గాయం అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు.. గూండా మూవీ షూటింగ్ లో చిరంజీవి ట్రైన్ సన్నివేశంలో స్టంట్ చేస్తూ గాయపడ్డారు. ఆ గాయం వల్లే కాలు అలా అయింది అని అంటున్నారు. అయితే ఆ గాయం చిరంజీవిని అంతగా ఇబ్బంది పెట్టలేదు. అందుకే ఆయన ప్రతి చిత్రంలో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ వచ్చారు అని అంటున్నారు.
55
చిరంజీవి నటిస్తున్న మూవీ
ఇటీవల కూడా చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. దాని నుంచి చిరు పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు అనే చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.