సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి కీలక పాత్రలో నటించబోతున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
అభిమానులంతా ఎదురుచూస్తున్న స్పిరిట్ చిత్రం ఇటీవలే లాంచ్ అయింది. చిరంజీవి చేతుల మీదుగా స్పిరిట్ మూవీ ప్రారంభం కావడం విశేషం. వచ్చే ఏడాది రాబోతున్న అత్యంత క్రేజీ పాన్ ఇండియా చిత్రాలలో స్పిరిట్ ఒకటి. చాలా రోజులుగా ఈ చిత్రం వార్తల్లో ఉంటూ వస్తోంది. ముందుగా దీపికా పదుకొనె ని హీరోయిన్ అనుకోవడం.. విభేదాల కారణంగా ఆమె తప్పుకోవడంతో ఈ చిత్రం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
25
స్పిరిట్ నుంచి తప్పుకున్న దీపికా
దీపికా తప్పుకున్న తర్వాత యానిమల్ బ్యూటి తృప్తి డిమ్రిని హీరోయిన్ గా ప్రకటించారు. తాజాగా స్పిరిట్ మూవీ గురించి మరో క్రేజ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ లో నటి కీలక పాత్రలో నటించబోతున్నారు. ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ కాజోల్. 51 ఏళ్ళ సీనియర్ హీరోయిన్ స్పిరిట్ మూవీలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
35
స్టార్ హీరో భార్యకి ఛాన్స్
కాజోల్ బాలీవుడ్ లో చాలా కాలం తిరుగులేని హీరోయిన్ గా రాణించారు. డబ్బింగ్ చిత్రాలు తప్ప ఆమె తెలుగులో స్ట్రైట్ గా ఇంతవరకు నటించలేదు. కాబట్టి ఆమెకి స్పిరిట్ తెలుగులో డెబ్యూ చిత్రం అవుతుంది. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఆమెకి పర్ఫెక్ట్ డెబ్యూ మూవీ అని చెప్పొచ్చు.
ఆమె భర్త, అగ్ర హీరో అజయ్ దేవగన్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. స్పిరిట్ మూవీలో ఇప్పటికే ప్రకాష్ రాజ్ నటుడిగా ఖరారయ్యారు. స్పిరిట్ సౌండ్ టీజర్ లో ఆయన డైలాగులు బాగా వైరల్ అయ్యాయి. ఈ మూవీలో పోలీస్ అధికారిగా ప్రభాస్ నటిస్తున్నారు.
55
హైదరాబాద్ లో షూటింగ్
ప్రస్తుతం స్పిరిట్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ 2 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటారట. టీ సిరీస్, భద్రకాళి సంస్థలు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.