Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?

Published : Dec 20, 2025, 09:17 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 గ్రాండ్‌ ఫినాలేకి చివరి రోజు ఓటింగ్‌లో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్‌ బాస్‌ నిర్వాహకులు పక్కా ప్లాన్‌ ప్రకారమే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. టాప్‌ కంటెస్టెంట్‌ తలక్రిందులయ్యారు. 

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఫినాలే ఓటింగ్‌ క్లోజ్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ ముగింపుకి ఇంకా ఒక్క రోజే ఉంది. దీంతో విన్నర్‌ ఎవరు అనేది మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఎవరికి వాళ్లు ప్రిడిక్షన్‌ ఇస్తున్నారు. ఓటింగ్ ప్రకారం కళ్యాణ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. తనూజ అని కొందరు అంటున్నారు. బిగ్‌ బాస్‌ ఏ సమయంలో అయిన ట్విస్ట్ ఇవొచ్చు. ఇమ్మాన్యుయెల్‌ని విన్నర్‌ ని చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఏం జరగబోతుందనేది మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓటింగ్‌ కూడా పూర్తయ్యింది. శుక్రవారంతో ఓటింగ్‌ లైన్స్ క్లోజ్‌ అయ్యాయి. ఈ క్రమంలో చివరి రోజు ఓటింగ్ లో బిగ్‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. టాప్‌ కంటెస్టెంట్లు తలక్రిందులయ్యారు. ఇదే ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది. 

25
నిన్నటి వరకు ఓటింగ్‌లో టాప్‌లో కళ్యాణ్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5లో కళ్యాణ్‌ పడాల, తనూజ, ఇమ్మాన్యుయెల్‌, సంజనా గల్రానీ, డీమాన్‌ పవన్‌ ఉన్నారు. వీరిలో నిన్నటి వరకు కళ్యాణ్‌ పడాలకి అత్యధిక ఓటింగ్‌ పడుతుంది. అనధికారికంగా నిర్వహించిన ఓటింగ్‌ లో కళ్యాణ్‌ టాప్‌లో ఉండగా, తనూజ రెండో స్థానంలో ఉంది. ఇమ్మాన్యుయెల్‌ మూడో స్థానంలో నిలిచారు. ఇక సంజనా, డీమాన్‌ పవన్‌ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. కానీ శుక్రవారం ఓటింగ్‌ లో భారీ మార్పులు జరిగాయి. ఓటింగ్‌ సరళి తలక్రిందులయ్యింది. టాప్‌ కంటెస్టెంట్‌ డౌన్‌ కావడం ఆశ్చర్యపరుస్తోంది. అధికారికంగా బిగ్‌ బాస్‌ నిర్వహించిన ఓటింగ్‌లోనే ఈ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

35
ఫైనల్‌ ఓటింగ్‌లో ట్విస్ట్.. టాప్‌ కంటెస్టెంట్‌ తలక్రిందులు

ఈ క్రమంలో ఇప్పుడు అంతిమంగా ఫైనల్‌ ఓటింగ్‌ చూస్తే తనూజ టాప్ లో ఉన్నారు. రెండో స్థానంలో కళ్యాణ్‌ పడాల నిలవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇక మూడో స్థానంలో ఇమ్మాన్యుయెల్ ఉన్నారు. నాల్గో స్థానంలో డీమాన్‌ పవన్‌, చివరగా సంజనా గల్రానీ ఉన్నారని సమాచారం. ఈ ఓటింగ్‌ ప్రకారం చూస్తే విన్నర్‌ తనూజ అనేది స్పష్టమవుతుంది. గత కొన్ని రోజులుగా తనూజనే విన్నర్‌ అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఓటింగ్‌ కళ్యాణ్‌కి ఎక్కువగా ఉన్నా, తనూజనే విన్నర్‌ని చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఓటింగ్‌లో ట్విస్ట్ ని చూస్తుంటే అదే నిజమని అనిపిస్తుంది. పక్కా ప్లాన్‌ ప్రకారమే ఇలా చేస్తున్నారని సమాచారం. మొత్తంగా ఏసియా నెట్ ముందు నుంచి చెబుతున్నట్టుగానే తనూజ విన్నర్‌ కాబోతున్నారని చెప్పొచ్చు.

45
ముందుగా ఎలిమినేట్‌ అయ్యేది వీరే

ఇక డేంజర్‌ జోన్‌లో సంజనా, డీమాన్‌ పవన్‌, ఇమ్మాన్యుయెల్‌ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరి ఎలిమినేషన్‌ ఈ రోజే జరగబోతుంది. కాసేపట్లో షూటింగ్‌ స్టార్ట్ చేస్తారు. మొదట సంజనాని ఎలిమినేట్‌ చేయబోతున్నారట. ఆ తర్వాత డీమాన్‌ పవన్‌ని ఎలిమినేట్‌ చేస్తారని తెలుస్తోంది. ఇమ్మాన్యుయెల్‌కి సూట్‌ కేసు ఆఫర్‌ ఇవ్వనున్నారని, ఆయన రిజెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇమ్మాన్యుయెల్‌కి కూడా విన్‌ అవుతాననే హోప్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రిజెక్ట్ చేస్తారని సమాచారం. దీంతో ఫైనల్‌కి తనూజ, కళ్యాణ్‌, ఇమ్మన్యుయెల్‌ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, కానీ ఎప్పటిలాగానే కమెడియన్‌ ఇమ్మాన్యుయెల్‌ని మూడో స్థానంలో ఎలిమినేట్‌ చేయబోతున్నారట.  

55
ఈ సీజన్‌ విన్నర్‌ ఎవరు ?

అయితే ఇందులో మరో ట్విస్ట్ కూడా వినిపిస్తోంది. తనూజని విన్నర్‌ని చేసి, ఇమ్మాన్యుయెల్‌ని రన్నరప్‌ చేయబోతున్నారని, కళ్యాణ్‌ని మూడో స్థానంలో ఎలిమినేట్‌ చేయబోతున్నారని అంటున్నారు. కళ్యాణ్‌ కి కూడా సూట్‌కేసు ఆఫర్‌ని రిజెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరగబోతుందో ఒక్క రోజులో క్లారిటీ రానుంది. ఈ సాయంత్రానికి విన్నర్‌కి సంబంధించిన స్పష్టత రాబోతుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories