
బ్రహ్మానందం, యోగిబాబు కలిసి నటించిన తాజా చిత్రం `గుర్రం పాపిరెడ్డి`. ఇందులో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లాతోపాటు జీవన్, కసిరెడ్డి రాజ్ కుమార్, వంశీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మురళీ మనోహర్ దర్శకుడు. డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డార్క్ కామెడీ కథతో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం(డిసెంబర్ 19న) విడుదలైంది. మరి ఇది ఆడియెన్స్ నవ్వించిందా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
గుర్రం పాపిరెడ్డి(నరేష్ అగస్త్య) అప్పుడే జైలు నుంచి వచ్చిన ఉడ్రాజు(యోగిబాబు)తో కలిసి బ్యాంక్ దొంగతనానికి పాల్పడతాడు. ఈ దొంగతనంలో తన పాత ఫ్రెండ్స్ మిలటరీ(కసిరెడ్డి), చిలిపి(వంశీధర్ గౌడ్)లతోపాటు గొయ్యి(జీవన్)లను కూడా చేర్చుకుంటారు. వీరందరితో కలిసి దొంగతనం పాల్పడతారు. దొంగతనం చేస్తారు, కానీ పోలీసులకు దొరికిపోతాడు. నగలు, వజ్రాలతో ఉడ్రాజు పారిపోతాడు. పాపిరెడ్డి అండ్ బ్యాచ్ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. జైలు నుంచి బయటకు పిచ్చి ఆసుపత్రిలోని నర్సు సౌదామిని(ఫరియా అబ్దుల్లా)తో, తన గ్యాంగ్‌తో కలిసి వేల కోట్లు కొల్లగొట్టే ప్లాన్ వేస్తారు. శ్రీశైలం అడవుల్లో ఉన్న శవాన్ని తీసుకొచ్చి హైదరాబాద్‌లోని క్రిష్ణానగర్‌లోని శ్మశానవాటిలో కళింగ పోతురాజు సమాధిలో పూడ్చే ప్లాన్ చేస్తారు. అనేక కష్టాలు పడి ఆ పని పూర్తి చేస్తారు. అనంతరం కళింగ వంశీయుల ఆస్తులపై కేసు వేస్తారు. గొయ్యినే కళింగ పోతురాజు మనవడు అని, తనని తమ కుటుంబీకునిగా గుర్తించాలని చెప్పి వారికి లేఖ రాస్తాడు. అనంతరం కేసు వేస్తారు. మరి శ్మశాన వాటికలో గొయ్యిలు తీసే గొయ్యికి, కళింగ వంశీయులకు సంబంధం ఏంటి? దీని వెనుక ఉన్న గుర్రం పాపిరెడ్డి అసలు ప్లానేంటి? దీనికోసం ఎంత మందిని బలిచేశాడు? ఈ కేసులో గెలుపు ఎవరిది? ఈ జర్నీలో స్టుపిడిటీకి కేరాఫ్‌గా నిలిచే మిలటరీ, చిలిపి, గొయ్యి, సౌదామిని ఏం చేశారు? దీనికి జడ్జ్(బ్రహ్మానందం) ఎలా హెల్ప్ అయ్యాడు? అనంతరం ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.
డార్క్ కామెడీ చిత్రాలు అడపాదడపా వస్తూనే ఉన్నాయి. అందులో ఒకటి అర ఆడియెన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అవుతున్నాయి. అయితే ఇలాంటి సినిమాల విషయంలో పేపర్‌పై ఉన్న కామెడీ తెరపై ఆవిష్కరించే క్రమంలో మిస్ ఫైర్ అవుతుంటాయి. అక్కడే చాలా సినిమాలు తేడా కొడుతుంటాయి. కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతాయి. `గుర్రం పాపిరెడ్డి` మూవీ కూడా ఈ కోవకి చెందినదే. డార్క్ కామెడీ ఇందులో చాలా వరకు వర్కౌట్ అయ్యింది. డార్క్ కామెడీలో ఇదొకి భిన్నమైన సినిమాగా చెప్పొచ్చు. ఎంచుకున్న కథ మాత్రం చాలా క్రేజీగా ఉంది. సినిమా ప్రారంభంలో జడ్జ్ బ్రహ్మానందం స్టుపిడిటీ గురించి వివరిస్తారు. అలా స్టుపిడిటీతో ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు ఎలాంటి క్రేజీ పనులు చేశారనేది ఆసక్తికరం. ఈ క్రేజ్ పనులు చేసే క్రమంలో జనరేట్ అయ్యే కామెడీని నమ్ముకుని ఈ మూవీని రూపొందించారు. ఆ కామెడీని జనరేట్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ప్రారంభంలో సినిమా కొంత లౌడ్‌గా ఉంటుంది. స్టుపిడిటీగానే సాగుతుంది. చూసే ఆడియెన్స్ కి కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. చిరాకుగా అనిపిస్తుంది. కానీ వెళ్లే కొద్ది ఆ స్టుపిడిటీనే బలంగా మారుతుంది. నవ్వులు జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. బ్యాంక్ రాబరీ చేసి, గొడవపడి పోలీసులకు దొరికిపోవడం, శవాన్నితీసుకొచ్చేందుకు వెళ్లి మళ్లీ వీళ్లకు వీళ్లు గొడవ పడటం, ప్లాన్ ని సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసేక్రమంలో అనేక చెత్త చెత్త పనులు చేయడం బాగుంది. శవాన్ని మార్చి కళింగ రాజవంశస్థులపై కేసు వేయడం, ఆ కేసు గెలిచేందుకు సాక్షాల విషయంలో వీళ్లు చేసే క్రేజీ పనులు నవ్వులు పూయిస్తాయి. కోర్ట్ లో జడ్జ్ బ్రహ్మానందం చేసే అసహనంతో కూడిన కామెడీ, అదే సమయంలో పంచ్ డైలాగ్‌లు అలరిస్తాయి. సెకండాఫ్‌లోనూ ఇదే తరహా కామెడీని వర్కౌట్ చేశారు. అయితే మొదటి భాగంతో పోల్చితే సెకండాఫ్‌లో ఫన్ సహజంగా వర్కౌట్ అయ్యింది. చాలా వరకు నవ్వించడంలో సక్సెస్ అయ్యింది. ఈ గుర్రంపాపిరెడ్డి గ్యాంగ్ చేసే చెత్త పనులు, గొడవలు, క్రేజీ పనులు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా గొయ్య పాత్ర సైతం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్ లో నరేష్ అగస్త్య ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. దీంతో మిగిలిన అందరు స్టుపిడ్స్ గా మిగిలిపోవడం క్రేజీ అని చెప్పొచ్చు.
సినిమాలో ఫన్ వర్కౌట్ అయ్యింది. ఫస్టాఫ్‌తో పోల్చితే సెకండాఫ్‌లో అది బాగా వర్కౌట్ అయ్యింది. బ్రహ్మానందం, యోగిబాబు పాత్రలు కాసేపే మెరిసినా బాగా అలరించారు. ప్రధానపాత్రలు సినిమాకి ప్రధాన బలం. బీజీఎం బాగుంది. ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని బాగా తెరకెక్కించారు. స్టుపిడిటీ అనే కాన్సెప్ట్ ని తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది.
మైనస్‌ల విషయానికి వస్తే, ఫస్టాఫ్‌లో కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. క్యారెక్టర్స్ ఓవర్ లౌడ్ చిరాకు తెప్పిస్తుంది. ఎంతసేపు కథ అక్కడక్కడే తిరుగుతుంది. విజువల్స్ పరంగా ఇంకా బాగా చేయాల్సింది. చాలా చోట్ల లాజిక్స్ మిస్ కావడం.
గుర్రం పాపిరెడ్డి పాత్రలో నరేష్ అగస్త్య చాలా బాగా చేశాడు, అదరగొట్టాడు. తనకు మంచి పేరుని తెచ్చే సినిమా అవుతుంది. సౌదామినిగా ఫరియా అబ్దుల్లా సైతం ఆకట్టుకుంది. క్రేజీ బ్యాచ్‌కి బాగా సెట్ అయ్యింది. గొయ్య పాత్రలో జీవన్ అదగొట్టాడు. సీరియస్‌గా కనిపించే ఆయన్ని కామెడీ జోన్‌లో ఆవిష్కరించిన మూవీ అవుతుంది. కసిరెడ్డి, వంశీధర్ గౌడ్ బాగా నవ్వించారు. బ్రహ్మానందం పాత్ర చాలా రోజుల తర్వాత నవ్వించింది. యోగిబాబు ప్రారంభంలో, ఎండింగ్‌లో మెరిసి హిలేరియస్‌గా నవ్వించాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
కృష్ణ సౌరభ్ సంగీతం బాగుంది. ఆర్‌ఆర్ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. అర్జున్ రాజా విజువల్స్ ఫర్వాలేదు. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. అయినా కొంత షార్ప్ చేయోచ్చు. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు మురళీ మనోహర్ ఎంచుకున్న కథ క్రేజీగా ఉంది. సినిమాని కూడా అంతే క్రేజీగా తెరకెక్కించారు. కామెడీని వర్కౌట్ చేయడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. చాలా వరకు బాగానే ప్రయత్నించారని చెప్పొచ్చు. ఓవర్ హంగామా, డ్రామా కొంత మైనస్‌గా మారినా, చాలా వరకు నవ్వులు పూయించడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.
క్రేజీ కామెడీ రైడ్ `గుర్రం పాపిరెడ్డి`. స్టుపుడిటీతో కూడిన నవ్వుల కోసం ఓసారి చూసేయొచ్చు.
రేటింగ్: 2.75