బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే, అభిమానులకు పోలీసుల వార్నింగ్..? అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రత్యేకంగా నిఘ

Published : Dec 20, 2025, 06:16 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జరగబోతుండటంతో.. అభిమానులకు పోలీసులు ప్రత్యేకంగా సూచనలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈసారి కూడా కొన్ని నిబంధనలు పెట్టినట్టు సమాచారం. 

PREV
15
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే..

సెప్టెంబర్ 10 మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తాజాగా గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. ఈసీజన్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. గత మూడు సీజన్లు పెద్దగా ఎంటర్టైన్ చేయకపోయినా.. ఈసీజన్ మాత్రం ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక ఈసారి విన్నర్ గా కప్పుగెలిచేది ఎవరు అనే విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల బిగ్ బాస్ అభిమానులు, కామన్ ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత వారం వరకూ.. కళ్యాణ్, తనూజ మాత్రమే ఫైనల్ రేసులో ఉండగా.. ఈ వారం వారికి తోడు పవన్ కూడా వచ్చి చేరాడు. దాంతో పోటీ మరింత టైట్ అయిపోయింది. దాంతో ఈ ముగ్గరిలో టైటిల్ కొట్టేది ఎవరా అని అంతటా చర్చ మొదలయ్యింది.

25
బిగ్ బాస్ అభిమానులకు పోలీసుల వార్నింగ్ నిజమేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే కోసం అంతా సిద్దం అయ్యింది. బిగ్ బిన్ టీమ్ అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే విన్నర్ ఎవరు అయినా సరే.. వారి అభిమానులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విన్నర్ ను ప్రకటించిన తరువాత ఎవరు స్టూడియో దగ్గర హడావిడి చేయకూడదు. ర్యాలీలు, విజయోత్సవాలు చేయకూడదు. అందుకోసం పోలీసులు ప్రత్యేకంగా సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అల్లరి చేయాలి అనుకున్నవారికి వార్నింగ్ కూడా ఇచ్చారట. వారు ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. గతంలో అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో జరిగిన ఓ గొడవ కారణంగా పోలీసులు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.

35
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఏం జరిగింది

గత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో సాధారణ రైతు బిడ్డగా హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి కప్పు గెలిచాడు. అదే సమయంలో ఆయనకు రన్నర్ గా నిలిచిన అమర్ దీప్ కు మధ్య హౌస్ లో జరిగిన గొడవ, బయట కూడా ప్రభావం చూపించింది. ప్రశాంత్ అభిమానులు, ఆయన మనుషులు అమర్ మీద దాడికి ప్రయత్నించినట్టు తెలిసింది. ఆ సమయంలో జరిగిన సంఘటనల కారణంగా.. సీజన్ 8 లో కూడా విన్నర్ సెలబ్రేషన్స్.. ను రద్దు చేశారు. అప్పట్లో చాలామంది అక్కడికి వచ్చి.. బస్సులు, కార్ల అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, ఆ గందరగోళానికి కారణమయ్యారనే ఆరోపణలతో పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. స్టూడియో ముందు ఎటువంటి వేడుకలు జరగకుండా నిషేదించారు. ఈసారి కూడా అదే ఫాలో అయ్యేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం.

45
గ్రాండ్ ఫినాలే రోజు.. భారీ బందోబస్తు

ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. బిగ్ బాస్ టీమ్ తో పాటు పోలీసులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పోలీసు శాఖ కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు.. . గ్రాండ్ ఫినాలే రోజు.. అక్కడ ప్రత్యేకంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేబోతున్నట్టు తెలుస్తోంది. అభియానులు అధిక సంఖ్యలో గుమిగూడవద్దని, ఎలాంటి చట్ట విరుద్ధ ఘటనలు జరిగినా ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.

55
బిగ్ బాస్ విన్నర్ ఎవరు?

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ విజేతపై ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కళ్యాణ్ పడాల, తనూజ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. ఓటింగ్ ప్రనకారం చూస్తే.. కళ్యాణ్ పడాల ముందంజలో ఉన్నట్లు సమాచారం. మొత్తం వోటింగ్‌లో 40 శాతం సాధించి కళ్యాణ్ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతని తర్వాత 38 శాతం వోటింగ్‌తో తనూజ రెండో స్థానంలో ఉంది. ఈ స్వల్ప తేడాతో చివరి నిమిషం వరకు పోటీ ఉత్కంఠగా కొనసాగే అవకాశముంది. మరి విజేతను ప్రకటించే వరకూ సస్పెన్స్ ఇలానే కొనసాగబోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories