డేటింగ్ తో హ్యాపీగా ఉన్నా, పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు.. బిగ్ బాస్ ఫ్లోరా షైనీ

Published : Oct 15, 2025, 09:28 PM IST

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్ ఫ్లోరా సైనీ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. 47 ఏడేళ్ల వయసు ఉన్నప్పటికీ ఆమె ఇంకా వివాహం చేసుకోలేదు. ఇకపై పెళ్లి చేసుకోనని ఆమె తేల్చి చెప్పేసింది.    

PREV
15
బిగ్ బాస్ షోలో ఫ్లోరా షైనీ 

తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచితమైన నటి ఫ్లోరా షైనీ ఇటీవల బిగ్ బాస్ 9 తెలుగు షోలో కంటెస్టెంట్‌గా కనిపించారు. చివరి వీకెండ్ లో ఆమె షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. రీసెంట్ గా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

25
47 ఏళ్ళ వయసులో సింగిల్ గా..

47 ఏళ్ల వయసులో ఇప్పటికీ సింగిల్‌గా ఉన్న ఫ్లోరా, తనకి వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదని స్పష్టంగా వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ, “నా పరిచయమున్న వారిలో ఎన్నో విఫలమైన వివాహాలు చూశాను. వివాహం అనే వ్యవస్థపై నాకు నమ్మకం తగ్గిపోయింది. కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేయడం లేదు,” అని తెలిపింది.

35
డేటింగ్ ముద్దు, పెళ్లి వద్దు 

తన ప్రస్తుత జీవితం గురించి మాట్లాడుతూ, “నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, మా రిలేషన్‌షిప్‌లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ వివాహం చేసుకోవాలనే ఆలోచన మాత్రం లేదు. ఈ రోజుల్లో చాలా మంది వివాహాలు రెండేళ్లు, మూడేళ్లలోనే విడాకుల దిశగా వెళ్తున్నాయి. కాబట్టి వివాహం కంటే లివ్-ఇన్ రిలేషన్‌లో ఉండటం బెటర్ అని నేను నమ్ముతాను,” అని ఫ్లోరా అన్నారు.

45
లక్స్ పాపగా గుర్తింపు 

ఫ్లోరా సైనీ మొదట ఆశా సైనీ పేరుతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆమె తన కెరీర్‌ను తెలుగు సినిమాలతో ప్రారంభించారు. బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహ నాయుడు సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ మూవీలో లక్స్ పాప అనే సాంగ్ తో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత కోడుకు దిద్దిన కాపురం, లక్కీ లేడీ, నువ్వు నాకు నచ్చావ్ వంటి అనేక చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

55
వేధించిన మాజీ ప్రియుడు

 ఫ్లోరా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లోనూ పలు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ఆమె వెబ్‌సిరీస్‌లు, రియాలిటీ షోల ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. బిగ్ బాస్ 9 తెలుగులో తన స్పష్టమైన అభిప్రాయాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తన మనసులోని మాటలను చెప్పి వార్తల్లో నిలిచారు. గతంలో ఫ్లోరా షైనీ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ నుంచి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంది. దీనితో ఫ్లోరా షైనీ అతడిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories