Thanuja: పెళ్లైన వ్యక్తిపై తనూజకి క్రష్‌.. పబ్లిక్‌గా చెప్పిన బిగ్‌ బాస్‌ నటి, ఈ యాంగిల్‌ కూడా ఉందా?

Published : Jan 09, 2026, 05:23 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 తో పాపులర్ అయిన తనూజ తన క్రష్‌ గురించి వెల్లడించింది. పెళ్లైన వ్యక్తిపై ఆమె క్రష్‌ని పెంచుకోవడం విశేషం. అంతేకాదు ఆ విషయాన్ని అందరి ముందు ఓపెన్‌గా చెప్పేసింది. 

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9తో పాపులర్‌ అయిన తనూజ

తనూజ పుట్టస్వామి బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోతో విశేషంగా పాపులర్‌ అయ్యింది. ఆమె అంతకు ముందు `ముద్దమందారం` అనే సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడ వంటి భాషల్లో పలు సీరియల్స్ చేసింది. ఒకటి అర సినిమాల్లోనూ నటించింది. అలాగే స్పెషల్‌ వీడియో సాంగ్స్ చేసి మెప్పించింది. ఈ క్రమంలో ఆమె ఇటీవల `బిగ్‌ బాస్‌ తెలుగు 9`లో పాల్గొని టాప్‌ కి వెళ్లింది. రన్నరప్‌గా వెనుతిరిగింది.

25
తన వ్యక్తిత్వంతో అందరి హృదయాలను గెలుచుకున్న తనూజ

అయితే ఈ షో తనూజని ఎంతో మందికి దగ్గర చేసింది. తాను ఎంతటి స్వీట్‌ పర్సనో ఆవిష్కరించింది. టాస్క్ లకు టాస్క్ లు, నామినేషన్స్ లో వాదనలకు వాదనలు, ఎంటర్‌టైన్‌ మెంట్‌కి ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఇస్తూ మెప్పించింది. అందరి హృదయాలను దోచుకుంది.   నిజానికి 9వ సీజన్‌ విన్నర్‌గా తనూజనే కావాల్సింది. కానీ కళ్యాణ్‌కి ఎక్కువ ఓటింగ్‌ పడటం, సోషల్‌ మీడియాలో అభిమానుల నుంచి ఒత్తిడి ఉండటంతో ఆయన్ని విన్నర్‌ ని చేయాల్సి వచ్చింది. అలా జరగకపోతే తనూజ చరిత్ర సృష్టించేది.

35
తన క్రష్‌ని బయటపెట్టిన తనూజ

ఇదిలా ఉంటే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనూజ తన కో ఆర్టిస్ట్ పవన్‌ సాయిపై తనకున్న అభిమానాన్ని, తమ మధ్య ఉన్న బాండింగ్‌ని తెలిపింది. కానీ గతంలో ఓ ప్రెస్‌ మీట్‌లో తన క్రష్‌ ఎవరో తెలిపింది. తన ఫస్ట్ క్రష్‌ గురించి తనూజ ఓపెన్‌ అయ్యింది. తనూజ యాంకర్‌ రవితో కలిసి `సమయమే` అనే ఒక వీడియో సాంగ్‌ చేసింది. దాదాపు ఐదేళ్ల క్రితం నాటి వీడియో ఇది. వీడియో సాంగ్‌ లాంచ్‌ ప్రెస్‌ మీట్‌లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన క్రష్‌ని వెల్లడించింది.

45
నోయల్‌పై తనూజకి క్రష్‌

ఈ సాంగ్‌ షూటింగ్‌ సమయంలో నోయన్‌ని చూసి ఆయనపై క్రష్‌ ఏర్పడిందట. ఆయన సింగర్‌ అని తెలిసి ఆశ్చర్యపోయిందట. ఆయన గురించి చెప్పినప్పుడు క్రష్‌ ఏర్పడిందని తెలిపింది. ఈ సందర్భంగా ఆయన తన అబ్బాయితో కలిసి సెట్‌కి వచ్చారు, ఆయన్ని చూసి ఇంప్రెస్‌ అయినట్టు చెప్పింది తనూజ. ఓ రకంగా నోయల్‌పై ఆమె అభిమానాన్ని, క్రష్‌ని అందరి ముందే ఓపెన్‌గా చెప్పింది. నోయల్‌ కూడా ఐ లవ్యూ టూ అంటూ రియాక్ట్ కావడం, దానికి యాంకర్‌ రవి అంతే క్రేజీగా కౌంటర్లు వేయడం విశేషం. అయితే అప్పటికే నోయల్‌కి మ్యారేజ్‌ అయ్యింది. ఎస్తేర్‌ని ఆయన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే(ఆ తర్వాత విడిపోయారు). ఆ సమయంలో నోయల్‌పై తనూజకి క్రష్‌ ఏర్పడటం విశేషం.

55
వీడియో సాంగ్స్, సినిమాల్లోనూ నటించిన తనూజ

తనూజ ఇలాంటి వీడియో సాంగ్స్ చాలా చేసింది. కృష్ణ మాస్టర్‌తోనూ చేసింది. మరోవైపు `లీగల్లీ వీర్‌` అనే మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఇలా ఏ ఛాన్స్ వచ్చినా వదలకుండా చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. ఇక ఇటీవల బిగ్‌ బాస్‌ షోకి వెళ్లాక నెక్ట్స్ ఏం చేయబోతుందనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే తనకు ఇంతటి పేరుని, గుర్తింపు తెచ్చిపెట్టింది తెలుగు ఆడియెన్సే అని, వారిని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories