మహిళల డ్రెస్సులపై వివాదం నడుస్తోన్న నేపథ్యంలో అనసూయకి నటి రాశి కౌంటర్ ఇచ్చింది. దీనికి అనసూయ కూడా సారీ చెప్పింది. కానీ ఆ విషయంపై మరోసారి అనసూయ రియాక్ట్ అయ్యింది. ఇది రచ్చ లేపుతుంది.
టాలీవుడ్‌లో మహిళలకు సంబంధించిన చాలా వివాదాల్లో అనసూయ పేరు వినిపిస్తుంటుంది. పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఆమెని ఇన్ వాల్వ్ చేస్తుంటారు. మహిళల ఫ్రీడమ్‌కి సంబంధించిగానీ, వాళ్లని తక్కువ చేసి మాట్లాడే విషయంలో ఆమె ఎప్పటికప్పుడు ఖండిస్తుంటుంది. కౌంటర్ ఇస్తుంటుంది. ఘాటుగా రియాక్ట్ అవుతూ మహిళా శక్తిని చాటే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ విషయంలో ఎవరికీ తాను బయపడదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని, తన అభిప్రాయాన్ని గట్టిగానే చెబుతుంది అనసూయ.
25
శివాజీ కామెంట్ల విషయంలో వివాదంలో ఇరుక్కున్న అనసూయ
అయితే అనసూయ తన అభిప్రాయాలు చెప్పే క్రమంలో అవి వివాదాలుగా మారుతుంటాయి. దానికి మరికొంత మంది సెలబ్రిటీలు స్పందించడం, తను క్రేజీగా రియాక్ట్ కావడం, మీడియా సైతం దాన్ని హైలైట్ చేయడంతో అనసూయ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆమెనే చెప్పినట్టు కొంత కాలం ట్రోలర్స్ కి, మీడియాకి ఆమె కంటెంట్‌గా మారుతుంది. శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన కామెంట్లకి అనసూయ రియాక్ట్ కాగా, ఆ రచ్చ ఇంకా నడుస్తూనే ఉంది. అయితే లేటెస్ట్ గా నటి రాశి కూడా స్పందించింది. ఓ షోలో తనని డబుల్ మీనింగ్ డైలాగ్‌తో అవమానించిన విధానంపై ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యింది. దీనికి అనసూయ కూడా స్పందించి క్షమాపణలు చెప్పింది.
35
రాశికి అనసూయ క్రేజీ కౌంటర్
ఈ క్రమంలో మరోసారి రాశి మాటలకు స్పందించింది. అనసూయ నెటిజన్లు, తన అభిమానులతో చాట్ చేసింది. ఇందులో అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ముఖ్యంగా మీరు ట్రోల్ కి గురవుతున్నారనే ప్రశ్న రాగా, ఆమె అదిరిపోయే సమాధానం చెప్పింది. తన అభిప్రాయం బలంగా చెబుతానని, కానీ దాన్ని వివాదం చేస్తుంటారని వెల్లడించింది. ఈ క్రమంలోనే రాశికి సంబంధించిన ప్రశ్న వచ్చింది. ఆ షోలో నాగబాబు వంటి వారు ఉన్నారు, అప్పుడెందుకు దీన్ని ఖండించలేదనే ప్రశ్నకి అనసూయ సమాధానం చెప్పింది.
అనసూయ మాట్లాడుతూ, `అప్పుడెప్పుడో జరిగిందానికి ఇప్పుడెందుకు అడిగారనేది నేను అడుతున్నానా? అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు అని నేను అడిగానా? తప్పు అనిపించింది కాబట్టి క్షమాపణలు అడిగాను. నేను తెలుగు రాకా అలా అనలేదు. తెలుగు రాని తనం అనే స్కిట్ పై చేసిన కామెడీ అది. ఇప్పుడు కూడా నాకు ఆ సినిమా పేరు తెలియదు. అది సినిమా స్ఫూఫ్ అని కూడా తెలియదు. నేను తిన్నింటి వాసాలు లెక్కపెట్టలేను. నేను ఇలాంటి స్కిట్లని చాలా సార్లు తిరస్కరించాను. కానీ ఆ షో క్రియేటివిటీ కోసం చేయాల్సి వచ్చింది. నాపై జోకులు వేస్తారు. వేరే వాళ్లపై వేస్తే తీసుకుంటారనుకున్నా, కానీ మేడమ్‌కి నచ్చలేదు అని చెప్పింది. అందుకే సారీ చెప్పాను, అంతేకాదు ఆ షో జర్నీ విషయంలో నాకు ఏం షేమింగ్ లేదు` అని వెల్లడించింది అనసూయ.
55
తన పేరుని వాడుకొని పాపులారిటీ
ఈ సందర్భంగా మీ పేరు వాడితే, మీ గురించి మాట్లాడితేనే వాళ్లకి పాపులారిటీ వస్తుందని మరో నెటిజన్ అడగ్గా, అది అందరికి తెలుసు. కానీ ఒప్పుకోరు. నాకంటే ఎక్కువగా ఇలాంటివి మాట్లాడేవారు ఉంటారు. నాకంటే పెద్ద వాళ్లు కూడా ఉంటారు. కానీ నా పేరే తీస్తారు, నా గురించే మాట్లాడుతుంటారు. దానికి కారణం నా పేరు చెబితేనే వాళ్లు ఫేమస్ అవుతారు` అంటూ ఇచ్చిపడేసింది అనసూయ. పరోక్షంగా నటి రాశితోపాటు తనపై కామెంట్లు చేసిన చాలా మంది సెలబ్రిటీలకు ఆమె కౌంటర్ ఇచ్చిందని చెప్పొచ్చు.