బిగ్ బాస్ హౌస్ లో సంజన సంచలనంగా మారారు. సంజన ఇంత డేరింగ్ గా మారడానికి ఆమె కెరీర్ బిగినింగ్ లో జరిగిన ఒక సంఘటనే కారణం. ఆమె తండ్రి కూడా ఇలాంటి కూతురు ఎందుకు పుట్టిందా అని బాధపడ్డారట.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సంజన గల్రాని ప్రకంపనలు సృష్టిస్తోంది. రీతూ చౌదరి వివాదంతో ఒక్కసారిగా సంజన సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. పవన్, రీతూ రిలేషన్ గురించి సంజన ఘాటుగా స్పందించింది. ఆమె మాటలు వివాదానికి కారణం అయ్యాయి. కానీ సంజనకి కూడా ఈ వివాదంలో అభిమానుల నుంచి సపోర్ట్ లభిస్తోంది. తనమాటపై తాను స్ట్రాంగ్ గా నిలబడి హౌస్ నుంచి వెళ్లిపోవడానికి కూడా సంజన సిద్దపడింది. నాగార్జున ఆమెని హౌస్ లో ఉంచాలా వద్దా అనే డెసిషన్ ని వేరేవాళ్ళ చేతుల్లో పెట్టారు. కానీ ఎవరి డెసిషన్ అవసరం లేదని తానే వెళ్లిపోతానని సంజన చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. చివరికి నాగార్జున కన్విన్స్ చేసి ఆమెని హౌస్ లో ఉంచాల్సి వచ్చింది.
26
సంజనకి అభిమానుల సపోర్ట్
ఒకరకంగా బలవంతంగా సంజన చేత సారీ చెప్పించారు అనే చెప్పాలి. ఈ సంఘటనతో ఆమె అభిమానులు ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. బిగ్ బాస్ లో సంజన ఐరన్ లేడీ అని అభివర్ణిస్తున్నారు. సంజన ఇంత డేరింగ్ గా మారడానికి కారణం ఆమెకి కెరీర్ బిగినింగ్ లో ఎదురైన సంఘటనలే అని తెలుస్తోంది. చాలా ఏళ్ళ క్రితమే తనకి కెరీర్ బిగినింగ్ లో ఎదురైన కష్టాలని సంజన అలీతో సరదాగా అనే కార్యక్రమంలో వివరించింది.
36
కన్నడలో బోల్డ్ మూవీ
బిగ్ బాస్ హౌస్ లో రీతూ లాగానే.. 17 ఏళ్ళ వయసులోనే తన కాలేజ్ ఫ్రెండ్ కి రీతూ వార్నింగ్ ఇచ్చిందట. అలీతో జరిగిన ఇంటర్వ్యూలో సంజన మాట్లాడుతూ.. మాది ముందు నుంచి ధనిక కుటుంబమే. నాన్నకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఉంది. వెల్ సెటిల్డ్. కానీ నాకు సినిమాలపై ఆసక్తి ఉంది. సినిమాల్లో అవకాశం వస్తే ఆ డబ్బుతో కారు కొనుక్కోవాలనే ఆశ ఉండేది. కన్నడలో గండ హెండతి అనే చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ మూవీలో నాది కాస్త బోల్డ్ రోల్. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి.
కానీ ఆ విషయం నాకు ముందు తెలియదు. అప్పుడు నా ఏజ్ 17 ఏళ్ళు. అంత మెచ్యూరిటీ కూడా లేదు. కథ తెలియకుండా సినిమాకి సైన్ చేశాను. 2 లక్షలు రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. అది మర్డర్ అనే హిందీ చిత్రానికి రీమేక్ అని తెలిసినప్పుడు షాక్ అయ్యా. వెంటనే రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేద్దాం అని వెళ్ళా. సార్ ఇంత బోల్డ్ గా నేను నటించలేను. ఈ కథకి నేను న్యాయం చేయలేను అని చెప్పా. అంత బోల్డ్ గా ఏమీ ఉండదు. భయపడాల్సిన అవసరం లేదు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ నేను ఒప్పుకోలేదు. నువ్వు ఇప్పుడు ఈ సినిమా చేయకపోతే ఆల్రెడీ సైన్ చేశావు కాబట్టి నీ పరువు తీస్తాం. చీటింగ్ చేసింది అని మీడియాకి చెబుతాం అంటూ బెదిరించారు.
56
ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగావు కదా..
దీనితో తప్పని పరిస్థితిల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ఆ టైంలో ఎందుకు ఇండస్ట్రీకి వచ్చానా అని బాధపడ్డాను. తొలి రోజు షూటింగ్ కి మా అమ్మా నాన్నా వచ్చారు. కిస్సింగ్ సీన్ చూసి ఇలాంటి కూతురు ఎందుకు పుట్టిందా అని నాన్న బాధపడ్డారు. కానీ అమ్మ నాకు సపోర్ట్ చేసింది. నువ్వు సినిమాలో కిస్ చేశావు అట కదా అని నా ఫ్రెండ్స్ కూడా అసభ్యంగా మాట్లాడడం ప్రారంభించారు. నన్ను అన్నవాళ్ళే కాలేజ్ లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ని నా కళ్ళముందే కిస్ చేశారు. ఒక ఫ్రెండ్ ఈ కిస్ గురించి నన్ను అడిగితే నేను వార్నింగ్ ఇచ్చాను. నువ్వు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ని మార్చావు. నా కళ్ళముందే కిస్ చేశావు కదా, నువ్వేంటి నాకు చెప్పేది అని ప్రశ్నించా. దీనితో ఆమె ఛీ ఛీ అంటూ వెళ్ళిపోయింది.
66
ఆ సంఘటనల వల్లే ఇలా
షూటింగ్ లో ఆ డైరెక్టర్ నాతో సైకోలాగా ప్రవర్తించాడు. తన శాడిజం మొత్తాన్ని నాపై చూపించాడు. నా కెరీర్ మొత్తంలో నాకు ఎదురైన చేదు సంఘటన అదే. ఆ సంఘటనలే నన్ను ధైర్యవంతురాలిగా మార్చాయి అని సంజన పేర్కొంది.