సిగ్గులేని జీవితం, మమ్మీ అంటూనే మోసం చేశాడు.. ఇమ్మాన్యుయేల్ పై సంజన ఫైర్

Published : Oct 22, 2025, 11:07 PM IST

బిగ్ బాస్ హౌస్ లో తనని మోసం చేయాలని చూసిన ఇమ్మాన్యుయేల్ పై సంజన ఫైర్ అయింది. ఇంటి సభ్యులు మాధురిని హౌస్ లో ఊరేగించారు. అది ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
మాధురితో విభేదించిన సంజన 

 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 45 వ రోజు చాలా సరదాగా సాగింది. ఇంటి సభ్యులు బ్లూ టీం, రెడ్ టీంగా విడిపోయి గేమ్ ఆడారు. రెడ్ టీంకి లీడర్ గా మాధురి, బ్లూ టీంకి లీడర్ గా సంజన ఉన్నారు. ప్రారంభంలో తనూజ, రీతూ చౌదరి మధ్య పెద్ద వివాదం జరిగింది. ముందుగా సంజన, మాధురికి అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఎవరో దొంగతనం చేసిన డబ్బుని మాధురి పంచడానికి తనూజ అంగీకరించలేదు. అడిగితే అది తన గేమ్ స్ట్రాటజీ అని మాధురి తెలిపింది. 

25
తనూజ వర్సెస్ రీతూ చౌదరి

రెడ్ టీంలో ఎవరు దొంగతనం చేసినా ఆ డబ్బు టీమ్ అందరికీ సమానంగా పంచాలి అని రీతూ తెలిపింది. దానికి తనూజ అంగీకరించలేదు. అలాంటప్పుడు టీం గా కలిసి గేమ్ ఆడడం ఎందుకు ? టీమ్ తీసేయండి ? ఎవరికి వారు ఇండివిడ్యువల్ గా గేమ్ ఆడుకోండి అంటూ రీతూ తనూజపై ఫైర్ అయింది. దీనితో ఇద్దరూ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకుంటూ గొడవ పడ్డారు. 

35
సంజనని చీట్ చేయాలని ఇమ్మాన్యుయేల్ ప్లాన్ 

ఆ తర్వాత బిగ్ బాస్ రెండు టీమ్స్ కి ఫన్నీ టాస్క్ ఇచ్చారు. రెడ్ టీం లీడర్ మాధురి కాఫీ షాప్ నడపాలని, బ్లూ టీం లీడర్ సంజన పానీ పూరి షాప్ నడపాలని ఆదేశించారు. రెడ్ టీం సభ్యుడైన ఇమ్మాన్యుయేల్.. తాను వెళ్లి సంజనని చీట్ చేసి వస్తానని మాధురికి చెప్పి వెళ్ళాడు. కానీ పానీ పూరీ కోసం బ్లూ టీంలో చేరిపోయాడు. తాను చెప్పినట్లు చేయలేదని, డబ్బులు ఇవ్వలేదని మాధురి.. ఇమ్మాన్యుయేల్ గురించి సంజనకు చెప్పేసింది. 

45
సిగ్గులేని జీవితం అంటూ ఫైర్ అయిన సంజన 

దీనితో సంజన .. సిగ్గులేని జీవితం, అమ్మా అమ్మా అంటూ ఇంత మోసం చేస్తావా అంటూ ఇమ్మాన్యుయేల్ పై ఫన్నీగా ఫైర్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చారు. కాలు పైకి లేపి చెప్పుల్ని బిగ్ బాస్ ఇచ్చిన బోర్డుకి ఎత్తులో అతికించాలి. ఈ టాస్క్ లో ఒక్కో టీం నుంచి ఐదుగురు సభ్యులు పాల్గొంటారు. ఐదు రౌండ్లు ఉంటాయి. ఎవరు ఎక్కువ రౌండ్స్ లో విజయం సాధిస్తే ఆ టీం విజేతలు. ఓడిపోయిన టీమ్ విజేత టీమ్ లీడర్ ని ఎత్తుకుని హౌస్ మొత్తం ఊరేగించాలి అని బిగ్ బాస్ తెలిపారు. 

55
మాధురిని ఊరేగించిన బ్లూ టీం 

ఈ గేమ్ లో సంజన టీం నుంచి పాల్గొన్న దాదాపు అందరూ ఫెయిల్ అయ్యారు. రెడ్ టీం నుంచి రీతూ చౌదరి 6 ఫీట్ హిట్ లో చెప్పని ఉంచింది. దీనితో మాధురి రెడ్ టీమ్ విజేతగా నిలిచింది. దీనితో బ్లూ టీం వాళ్ళు మాధురిని ఎత్తుకుని హౌస్ లో ఊరేగించారు. 

Read more Photos on
click me!

Recommended Stories