నా ఫ్లాప్స్ అన్నింటికీ మహేష్ బాబు మూవీనే కారణం.. డైరెక్టర్ కామెంట్స్, అంత ఘోరమైన సినిమా ఏంటో తెలుసా

Published : Oct 22, 2025, 08:21 PM IST

తన ఫ్లాప్ సినిమాలకు కారణం మహేష్ బాబుతో చేసిన ఒక్క సినిమానే అని స్టార్ డైరెక్టర్ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డైరెక్టర్ ఎవరు ? ఎందుకు అలా అన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
డైరెక్టర్ తేజ సినిమాలు

డైరెక్టర్ తేజ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాలో కొత్త తరం హీరోలు ఎంటర్ అవుతున్న 2000 ఆరంభంలో డైరెక్టర్ తేజ యువతకి కనెక్ట్ అయ్యే అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలు అందించారు. అప్పటి యువత ఆలోచనలని ప్రతిభింబించేలా ఆయన చిత్రాలు ఉండేవి. జయం, చిత్రం, నువ్వు నేను లాంటి చిత్రాల గురించి విపరీతంగా యువత మాట్లాడుకునేవారు.

25
నా ఫ్లాప్స్ కి కారణం అదే

డైరెక్టర్ తేజ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రతి చిత్రం గురించి ఒక్క మాటలో వర్ణిస్తూ తేజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు నిజం మూవీ గురించి తేజ ఎవ్వరూ ఊహించని వ్యాఖ్యలు చేశారు. నిజం మూవీ గురించి చెప్పమని యాంకర్ ప్రశ్నించగా.. 'నా ఫ్లాప్ సినిమాలన్నింటికీ అదే కారణం' అని తేజ బదులిచ్చారు.

35
14 ఏళ్ళు పట్టింది

నిజం ముందు వరకు తేజకి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. నిజం తర్వాత నేనే రాజు నేనే మంత్రి రిలీజ్ అయ్యే వరకు తేజ తెరకెక్కించిన చిత్రాలన్నీ డిజాస్టర్ అవుతూ వచ్చాయి. నిజం తర్వాత సక్సెస్ టేస్ట్ చేయడానికి తేజకి 14 ఏళ్ళు పట్టింది. బహుశా అందుకే తేజ.. తన ఫ్లాప్ సినిమాలకు కారణం నిజం అని అన్నారేమో.

45
నిజం మూవీ కథాంశం

మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం లంచం, అవినీతిపై తిరుగుబాటు కథాంశంతో రూపొందింది. గోపీచంద్ విలన్ గా నటించారు. గోపీచంద్ తో పాటు రాశి పాత్ర కూడా ఈ చిత్రంలో వర్కౌట్ కాలేదు. మహేష్ బాబు ఇలాంటి సందేశాత్మక చిత్రంలో నటించడం కూడా ఫ్యాన్స్ కి ఎక్కలేదు. ఫలితంగా నిజం మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

55
జయం క్లాసిక్ మూవీ

ఇక తేజ ఒక్కో చిత్రం గురించి అభివర్ణిస్తూ.. ''చిత్రం.. నా ఫేవరేట్, ఫ్యామిలీ సర్కస్.. మంచి కామెడీ, నువ్వు నేను.. మంచి స్క్రీన్ ప్లే, జయం.. క్లాసిక్, నిజం.. నా ఫ్లాప్స్ అన్నింటికీ కారణం'' అని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories