బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో నాల్గవ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలిపింది. విపరీతమైన నెగిటివిటి ఉన్న ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతుండడంతో బిగ్ బాస్ షోలో నస వదిలింది అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఒక్కో వారం గడిచే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. గత వారం అనూహ్యంగా ప్రియా శెట్టిని ఎలిమినేట్ చేశారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది. ఫోర్త్ వీక్ నామినేషన్ లో రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజన, శ్రీజ, హరిత హరీష్, దివ్య ఉన్నారు.వీకెండ్ వచ్చేయడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ మొదలైంది.
25
హరిత హరీష్ అవుట్
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి హరిత హరీష్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఆదివారం రోజు జరగబోయే ఎపిసోడ్ లో హరిత హరీష్ ఎలిమినేట్ అవుతారు. ఈ వారం ఓటింగ్ లో శ్రీజ, హరిత హరీష్, ఫ్లోరా షైనీ అతి తక్కువ ఓట్లతో ఉన్నారట. శ్రీజ, ఫ్లోరా షైనీ మాత్రం సేవ్ అయ్యారు. హరిత హరీష్ తన రెబల్ యాటిట్యూడ్ తో బిగ్ తెలుగు సీజన్ 9లో మంచి స్టార్ట్ ఇచ్చాడు. అందరినీ ఆకర్షించాడు. కానీ తన లెగ్ ఇంజ్యురి వల్ల హరిత హరీష్ ఫిజికల్ టాస్క్ లలో వెనుకబడిపోయాడు.
35
హరీష్ ఎలిమినేషన్ కి కారణాలు
దీనికి తోడు హరితా హరీష్.. చీటికి మాటికి సంజనతో గొడవ పెట్టుకోవడం కూడా నెగిటివిటి పెంచింది. ఈ కారణాల వల్ల హరిత హరీష్ ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. హరిత హరీష్ అగ్ని పరీక్ష నుంచి కామనర్ గా బిగ్ బాస్ హౌస్ లో స్థానం సంపాదించుకున్నారు. హరిత హరీష్ ఎలిమినేషన్ తో మరో కామనర్ హౌస్ ని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హరిత హరీష్ కి అగ్నిపరీక్ష నుంచే నెగిటివిటి మొదలైంది. రెబల్ యాటిట్యూడ్ పేరుతో అతిగా బిహేవ్ చేయడం ప్రారంభించాడు. అతడు ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతాడా అని కొందరు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి హరీష్ ఎలిమినేట్ కానుండడంతో బిగ్ బాస్ షోలో నస వదిలింది అని కామెంట్స్ చేస్తున్నారు.
హరిత హరీష్ కి అగ్నిపరీక్ష నుంచే నెగిటివిటి మొదలైంది. రెబల్ యాటిట్యూడ్ పేరుతో అతిగా బిహేవ్ చేయడం ప్రారంభించాడు. అతడు ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతాడా అని కొందరు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి హరీష్ ఎలిమినేట్ కానుండడంతో బిగ్ బాస్ షోలో నస వదిలింది అని కామెంట్స్ చేస్తున్నారు.
55
5 వైల్డ్ కార్డు ఎంట్రీలు
హరిత హరీష్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో 5 వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఆల్రెడీ దివ్య వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చే సెలెబ్రెటీల్లో కమెడియన్ ప్రభాస్ శ్రీను, బుల్లితెర నటుడు నిఖిల్ నాయర్, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, నటుడు అఖిల్ రాజ్, మోడల్ మౌనీషా చౌదరి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.