ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి వెళ్లబోతున్న సెలబ్రిటీల లిస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ లిస్ట్‌లో పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ముద్ద మందారం సీరియల్ నటి తనుజా గౌడ, ‘గుప్పెడంత మనసు’సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ, ‘కోయిలమ్మ’ సీరియల్ ఫేమ్ తేజస్విని గౌడ లు హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారని టాక్.
అలాగే.. జానీ మాస్టర్‌పై సంచలన ఆరోపణలు చేసి పాపులారిటీ తెచ్చుకున్న శ్రేష్టి వర్మ కూడా ఈ సీజన్‌లో ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు.. జబర్దస్త్ ఇమాన్యుయేల్, నటుడు హరిత్ రెడ్డి, ‘రాను బొంబాయికి రాను’ పాటతో సోషల్ మీడియాలో వైరల్ అయిన సింగర్ రాము రాథోడ్ కూడా లిస్ట్‌లో కనిపిస్తున్నారు.
అంతేకాక, సోషల్ మీడియా సంచలనం, పికిల్స్ బిజినెస్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన అమ్మాయి అలేఖ్య చిట్టి కూడా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారని టాక్. ఇక సీరియల్ యాక్టర్, మెగా ఫ్యామిలీకి ఆప్తుడిగా పేరున్న భరణి కుమార్ కూడా ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం.