Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటి’ సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క తన పాత్ర, సినిమా విశేషాలు, ప్యూచర్ ప్లాన్స్ పంచుకున్నారు.
Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటి’ సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఈ సందర్భంగా అనుష్క శెట్టి ఇంటర్వ్యూలో తన పాత్ర, సినిమా విశేషాలను పంచుకున్నారు.
25
శీలావతి పాత్రపై అనుష్క స్పందన
శీలావతి పాత్ర గురించి అనుష్క మాట్లాడుతూ.. ‘ఘాటి సినిమా లో నేను చేసిన శీలావతి పాత్ర నా కెరీర్‌లో ప్రత్యేకం. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్ర ఇది. చాలా బ్యూటిఫుల్ షేడ్స్ కలిగిన క్యారెక్టర్. కంఫర్ట్ జోన్ దాటి చేసిన సినిమా ఇది. నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోల్ ఇదే’అని తెలిపారు.
35
సరోజ్ పాత్రకు కొనసాగింపా ?
డైరెక్టర్ క్రిష్ తో పనిచేయడం గురించి మాట్లాడుతూ.. ‘ వేదం తర్వాత క్రిష్‌తో మళ్లీ కలిసి పనిచేయడం నాకు ఆనందంగా ఉంది. సరోజ్ పాత్రకు కొనసాగింపుగా చేయాలని అనుకున్నాం. ఆ సమయంలో ‘ఘాటి’ కథ వచ్చింది. క్రిష్ ఎప్పుడూ నన్ను కొత్త కోణంలో చూపించే పాత్రలనే ఇస్తారు. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది” అని పేర్కొన్నారు. అలాగే.. క్రిష్ టేకింగ్ గురించి మాట్లాడుతూ.. ‘క్రిష్ ఎప్పుడూ సోషల్‌గా రెలెవెంట్ స్టోరీలనే ఎంచుకుంటారు. ఈ సినిమాలో గంజాయి ఎలిమెంట్ ఉన్నా, మేము దీన్ని కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీశాం. కానీ ఇందులో పాజిటివ్ మెసేజ్ కూడా ఉంటుంది. అది ఆడియెన్స్‌ని టచ్ చేస్తుంది” అని అనుష్క చెప్పారు.
అనుష్క ఘాటి షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ.. “కొత్త లొకేషన్లలో షూటింగ్ చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఫిజికల్‌గా హార్డ్ వర్క్ ఎక్కువైందే కానీ, అది మెమరబుల్ మూమెంట్. క్రిష్ గారు షూటింగ్ చాలా చక్కగా ప్లాన్ చేశారు. ఈ సినిమా కోసం మూడు పాటలు రాశారు. అందులో ‘కుందేటి చుక్క’ పదప్రయోగం నాకు బాగా నచ్చింది. చిన్నచిన్న మాటలతో ఆయన కథలో గొప్ప డెప్త్ తీసుకొస్తారు. కెమెరామాన్ మనోజ్ అద్భుతంగా విజువల్స్ క్యాప్చర్ చేశారు. సంగీత దర్శకుడు సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకి కొత్తదనం తీసుకొచ్చింది. మ్యూజిక్ కూడా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ లాంటిదే”అని అనుష్క అభిప్రాయపడ్డారు.
55
20 ఏళ్ల సినీ జర్నీపై రియాక్షన్
అనుష్క తను వర్క్ లైన్ గురించి మాట్లాడుతూ.. “నా ఫిలిం కెరీర్‌లో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో నన్ను అండగా నిలబెట్టిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఒక అవుట్ అండ్ అవుట్ నెగటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. బలమైన పాత్ర కుదిరితే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం ఒక మలయాళ సినిమా చేస్తున్నాను. అది నా ఫస్ట్ మలయాళ ఫిల్మ్. అలాగే ఒక కొత్త తెలుగు ప్రాజెక్ట్ కూడా సైన్ చేశాను. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది” అని అనుష్క చెప్పారు. అలాగే.. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ.. “నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తాను, పుస్తకాలు చదవడం ఇష్టం. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నాను. గత రెండేళ్లుగా ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడుపుతున్నాను” అని తెలిపారు.