
బిగ్‌బాస్ హౌస్ లో ప్రస్తుతం టాస్క్ ల సమరం కొనసాగుతోంది. ప్రతీవారంలా.. ఈ వారం కూడా టాస్క్ ల విషయంలో ఏదో ఒక రచ్చ జరగడం కామన్ అయిపోయింది. రసవత్తరంగా కొనసాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్కులు జరుగుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా ఇమ్మాన్యుయేల్ ఉండగా.. కెప్టెన్నసీ టాస్క్ జోరుగా సాగుతోంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ బీబీ రాజ్యంగా మారిపోయింది. ఈ బీబీ రాజ్యానికి పవన్ కళ్యాణ్ రాజు కాగా.. దివ్య, రీతూ ఇద్దరూ మహారాణులు అయ్యారు. తనూజ, నిఖిల్, డీమాన్, సంజన నలుగురిని కమాండర్లుగా సెలక్ట్ చేయగా.. మిగిలినవారిని రాజ్యంలోని ప్రజలను సెలక్ట్ చేశారు.
ఇక వీరి మధ్య బిగ్‌బాస్ హౌస్ లో టాస్కులు హోరా హోరీగా కోనసాగుతున్నాయి. టాస్కులు లేని ఖాళీ సమయంలో తమకు నచ్చిన వాళ్లతో సేవలు చేయించుకునే అవకాశం రాజు, రాణీలకు బిగ్ బాస్ ఇచ్చాడు. ఈ క్రమంలో రాణి దివ్య ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. బిగ్ బాస్ రాజ్యంలోని ప్రజలతో బాగా సేవలు చేయించుకుంటోంది. ఈక్రమంలో భరణితో హెడ్ మసాజ్ చేయించుకుంది దివ్య.
భరణి రాణివారుగా ఉన్న దివ్యకు మసాజ్ చేయడానికి సిగ్గుపడ్డాడు. అయినా సరే భరణిని వదిలిపెట్టలేదు దివ్య.. ఇక దివ్యకు భరణి మసాజ్ చేయమంటే వేళ్ళతో తలపై గోకడం మొదలు పెట్టాడు. మసాజ్ చేయమంటే గోకుతావేంటి అని దివ్య..భరణికి స్వీట్ వార్నింగ్ ఇ్చింది. ఇక వీరి మధ్యలో సుమన్ శెట్టి నిల్చువాలని ఆర్డర్ వేయడంతో..మరో శిక్ష వేయండి మహారాణి అంటూ కామెడీ చేశాడు భరణి. దివ్యకు భరణికి మధ్యలో సుమన్ శెట్టి నిల్చొని.. భరణి కళ్లలో కళ్లు పెట్టి చూడాలని మహారాణి ఆర్డర్ వేసింది. ఆతరువాత కమాండర్స్ గా ఉన్న నలుగురికి టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కు రీతూ సంచాలక్ గా ఉండగా.. సంజనాకు, రీతుకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆతరువాత సంజన ఈ టాస్క్ లో ఓడిపోయింది.
మొదటి టాస్క్ లో ఒడిపోయిన సంజన తన కమాండర్ తన స్థానం నిలబెట్టుకోవడానికి బిల్డ్ ఇట్ టూ విన్ ఇట్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. తనతో పోటీ చేసే వారిని ఎంచుకునే అవకాశం ఇవ్వగా.. ఆమె సుమన్ ను ఎంచుకుంది. ఈ టాస్క్ లో సుమన్ శెట్టి, సంజన ఇద్దరూ పోటీ పడ్డారు. సంజనాకు పోటీగా సుమన్ టాస్క్ అదరగొట్డాడు. ఇందులో తమకు కేటాయించిన బాక్సులను ఒక్కొట్టిగా సెట్ చేయాలి. ఈ టాస్కులో సుమన్ శెట్టి హైట్ తక్కువ కావడంతో సంజనకు ప్లస్ అయ్యింది. అయినప్పటికీ సంజకు ఈక్వెల్ గా టవర్ నిర్మించాడు. ఇద్దరిలో విన్నర్ ఎవరనేది తేల్చడం సంచాలక్ గా పవన్ కళ్యాణ్ కు అగ్నిపరిక్షలా మారింది.
ఇద్దరి టవర్స్ ఈక్వెల్ గా ఉండటంతో ... టవర్ ఫర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి అంటూ సంజనను విన్నర్ గా ప్రకటించాడు కళ్యాణ్. కానీ టవర్ సరిగ్గా ఉండాలని ముందు చెప్పలేదన్న కారణంగా.. కళ్యాణ్ నిర్ణయాన్ని చాలామంది హౌస్ మెంట్స్ వ్యతిరేకించారు. అప్పుడే మధ్యలోకి వచ్చిన తనూజ… టవర్ ఫర్ఫెక్ట్ గా ఉండాలని ముందే చెప్పలేదంటూ గొడవ చేసింది. దీంతో కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. నీకు సగం సగం అర్థమైతే సగం సగం చెప్పకు అని పెద్ద పెద్దగా అరిచాడు. అంతే కాదు ఇష్టమొచ్చినట్లుగా పోట్రే చేస్తే వినడానికి ఎవరూ రెడీగా లేరు అంటూ ఇచ్చిపడేశాడు. దీంతో ఎవడూ పోట్రే చేయలేదు అంటూ తనూజ కూడా రివర్స్ లో గట్టిగా వాదించింది. దాంతో మరోసారి పవన కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. ఎవరు ఏమన్నా విన్నర్ సంజన అని ప్రకటించాడు కళ్యాణ్. ఈవిషయంలో హౌస్ లో భిన్న స్వరాలు వినిపించాయి. కాగా కళ్యాన్ సుమన్ ను కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఈ వాదనలో దివ్యాకు, పవన్ కళ్యాణ్ కు మధ్య కూడా చిన్న వాదులాట జరిగింది. చివరకు సంజన కమాండర్ గా తన స్థానం నిలబెట్టుకుంది.