గౌతమ్ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు. ఓ దశలో మణికంఠ స్థానంలో ఆయన ఎలిమినేట్ కూడా కావాల్సింది. కానీ మణికంఠ వెళ్లిపోవడంతో సేవ్ అయ్యాడు. అప్పట్నుంచి తన ఆట తీరు మార్చుకున్నారు. ఫైరింగ్ మూడ్‌లోకి వచ్చాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లని టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతూ వచ్చాడు. అనూహ్యంగా టాప్‌లోకి వచ్చాడు గౌతమ్.
అంతేకాదు టైటిల్ రేస్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో ఇప్పుడు చాలా వరకు గౌతమ్ విన్నర్ అవుతాడని భావించారు. అఖిల్ కూడా అదే చెప్పారు. కానీ బిగ్ బాస్ షో వెనుక, జరిగే నిజాలను బయటపెట్టారు. విన్నర్ ఆల్‌రెడీ డిసైడ్ అయ్యాడని, నిఖిల్ ని విన్నర్‌ని చేయబోతున్నారని అఖిల్ తెలిపారు.