మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా మంచు మనోజ్, మోహన్ బాబు తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ తెలుగు మీడియా ఛానల్స్ కథనం ప్రకారం మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఘర్షణ చోటు చేసుకుందట. ఆస్తుల విషయంలో విభేదాలు మొదలై పెద్ద రచ్చగా మారినట్లు తెలుస్తోంది.