రాజమౌళి సినిమాలో ప్రభాస్‌, ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ ఫిక్స్.. రోల్స్ ఇవే..? అదే జరిగితే సరికొత్త చరిత్రే?

Published : Jun 30, 2024, 07:14 PM IST

`కల్కి 2898ఏడీ` సినిమా బాక్సాఫీసుని షేక్‌ చేయడంతోపాటు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపిన నేపథ్యంలో ఇప్పుడు రాజమౌళి సినిమాలో ముగ్గురు హీరోలు ఫిక్స్ అనే చర్చ మొదలైంది.   

PREV
17
రాజమౌళి సినిమాలో ప్రభాస్‌, ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ ఫిక్స్.. రోల్స్ ఇవే..? అదే జరిగితే సరికొత్త చరిత్రే?

 నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన `కల్కి 2898ఏడీ` సినిమా విశేష ఆదరణ పొందుతుంది. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్, దీపికా పదుకొనెలు చేసిన మ్యాజిక్‌, విజయ్‌ దేవరకొండ, దుల్కర్, మృణాల్‌ ఇచ్చిన మెరుపులు సినిమాకి ప్లస్‌ అయ్యాయి. ఇక క్లైమాక్స్ సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాయి. 

27

`కల్కి` సినిమా మొత్తానికి మహాభారతం ఎపిసోడ్‌ హైలైట్‌. ఆ ఎపిసోడ్‌ని పక్కన పెడితే సినిమాలో ఏం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నేపథ్యంలో ఓ కొత్త చర్చ ప్రారంభమైంది. ప్రభాస్‌, ఎన్టీఆర్‌ రోల్స్ కి సంబంధించిన చర్చ సోషల్‌ మీడియాలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో కృష్ణుడు పాత్ర బాగా హైలైట్‌ అయ్యింది. కానీ ఆ పాత్రలో తెలిసిన నటుడు లేరు. కృష్ణకుమార్‌ అనే నటుడిని తీసుకున్నారట. ఆయన ఫేస్‌ని కూడా సరిగా చూపించలేదు.  
 

37

అయితే కృష్ణుడి పాత్ర కోసం ఎన్టీఆర్‌ని సంప్రదించారట నాగ్‌ అశ్విన్‌. కానీ ఆయన తిరస్కరించినట్టు తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో మహాభారతంలో కృష్ణుడి పాత్రకి ఎవరైనా బాగా సూట్‌ అవుతారు, మీరు ఎవరిని తీసుకుంటారని ఓ అభిమాని అడగ్గా, జక్కన్న.. ఎన్టీఆర్‌ పేరు చెప్పారు. ఇప్పుడు అదే పేరు వైరల్‌గా మారింది. 
 

47
actor Prabhas movie Kalki 2898 AD Video Song

మరోవైపు `కల్కి 2898ఏడీ` సినిమాలో ప్రభాస్‌ని భైరవగానే కాదు, కర్ణుడి పాత్రలోనూ చూపించారు. మహాభారతం ఎపిసోడ్‌లో ట్విస్ట్ పేరుతో చివర్లో ప్రభాస్‌ని కర్ణుడిగా చూపించారు. ఆ సమయంలో థియేటర్లు దద్దరిల్లాయి. అంతేకాదు గతంలో రాజమౌళి చెప్పిన వీడియో క్లిప్‌ కూడా వైరల్‌గా మారింది. మహాభారతంలో కర్ణుడిపాత్రకి ఎవరిని తీసుకుంటారని అడగ్గా, ప్రభాస్‌ పేరు చెప్పారు రాజమౌళి. ఈ వీడియో క్లిప్‌ కూడా వైరల్‌గా మారింది.

57
Kalki 2829 AD

దీంతోపాటు ఇందులో అర్జునుడిగా విజయ్‌ దేవరకొండ నటించి మెప్పించిన  విషయం తెలిసిందే. విజయ్‌ పాత్ర ఎంట్రీ సమయంలోనూ థియేటర్లలో అరుపులు మామూలుగా లేవు. ప్రభాస్‌ కర్ణుడి పాత్ర తర్వాత విజయ్‌ పాత్రకే అంతటి స్పందన లభించడం విశేషం. ఆయన లుక్‌ కూడా బాగా సెట్‌ అయ్యింది. 

67

ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్పులు, గతంలో రాజమౌళి చెప్పిన విషయాలు, `కల్కి` సినిమా విషయంలో జరిగిన చర్చ నేపథ్యంలో నెటిజన్లు ఓ కన్‌క్లూజన్‌కి వస్తున్నారు. రాజమౌళి నెక్ట్స్ మహాభారతం సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. తన లైఫ్‌ టైమ్‌ డ్రీమ్‌ అదే అని చెప్పారు రాజమౌళి. ఐదుపార్ట్ లుగా దాన్ని తీస్తా అని కూడా చెప్పారు. దాన్ని తీయడానికి ఇంకా టైమ్‌ పడుతుందని చెప్పారు. 
 

77

ఈ నేపథ్యంలో `కల్కి 2898 ఏడీ` అనంతర పరిణామాల నేపథ్యంలో రాజమౌళికి ఆల్‌రెడీ ఇద్దరు హీరోలు దొరికారని, ఆయన తీయబోయే `మహాభారతం`లో కర్ణుడిగా ప్రభాస్‌, కృష్ణుడిగా ఎన్టీఆర్, అర్జునుడిగా విజయ్‌ ఫిక్స్ అంటున్నారు. మరి జక్కన్న కూడా భవిష్యత్‌లో ఆయా పాత్రలకు వీరినే ఎంపిక చేస్తాడా? మారుస్తాడా అనేది చూడాలి. ఇప్పటికే ప్రభాస్‌తో `ఛత్రపతి`, `బాహుబలి` చిత్రాలు తీశాడు రాజమౌళి. అలాగే తారక్‌తో `స్టూడెంట్‌ నెం 1`, `సింహాద్రి`, `యమదొంగ`, `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాలు చేశారు. విజయ్‌ దేవరకొండతో ఎలాంటి సినిమాలు చేయలేదు. జరిగితే అది మహాభారతమే కాబోతుందని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories