బుల్లితెరపై ప్రసారం అయ్యే ఢీ షోతో నైనికా డ్యాన్సర్ గా ప్రూవ్ చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఛాన్స్ రావడంతో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. ఆరంభంలో బాగానే పెర్ఫామ్ చేసిన నైనికా ఆ తర్వాత నెమ్మదించింది. దీనితో ఆమె 35వ రోజున హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకి వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన నైనికా తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.