బిగ్ బాస్ తెలుగు 8... ఈసారి ఇంట్లో మూడు బెడ్ రూమ్స్, ఎంట్రీ ఇస్తున్న 16 మంది వీరే!

First Published Sep 1, 2024, 9:24 AM IST

బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ పై వస్తున్న ఒక్కో అప్డేట్ ఆడియన్స్ లో ఆసక్తి రేపుతోంది. ఈసారి హౌస్లో మూడు గదులు ఉంటాయట. వాటి ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.. 
 

బిగ్ బాస్ లవర్స్ కి నేడు పండగ రోజు. సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హోస్ట్ నాగార్జున నేతృత్వంలో భారీగా ప్లాన్ చేశారని తెలుస్తుంది. స్టార్స్ ఎంట్రీలు, హీరోయిన్స్ పెర్ఫార్మన్స్ లతో పాటు కంటెస్టెంట్స్ వేదికపై సందడి చేయనున్నారు. ఒక్కొక్కరిగా నాగార్జున కంటెస్టెంట్స్ ని పరిచయం చేయనున్నాడు. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా భారీ టీఆర్పీ రాబట్టాలని స్టార్ మా  ప్రయత్నం చేస్తుందట. 

గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో అత్యంత ఆసక్తి రేపే అంశం కంటెస్టెంట్స్ పరిచయం. గత రెండు నెలలుగా కంటెస్టెంట్స్ విషయంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా తెలిసేది గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తర్వాతే. సోషల్ మీడియాలో మాత్రం... నటుడు అభయ్ నవీన్, నటుడు ఆదిత్య ఓం, సీరియల్ నటుడు నిఖిల్, నాగ మణికంఠ, విష్ణుప్రియ, నైనిక, యాష్మి గౌడ, ప్రేరణ, కిరాక్ సీత, పరమేశ్వర్, న్యూస్ రీడర్ కళ్యాణి, రవితేజ, సోనియా ఆకుల, బెజవాడ బెబక్క కంటెస్టెంట్స్ గా ఎంపికైన లిస్ట్ లో ఉన్నారట. 

Latest Videos


Bigg Boss telugu season 8

ఈ 16 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారట. అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీతో మరో 5 మంది కంటెస్టెంట్స్ ని ప్రవేశ పెడతారట. సీజన్ 7లో ఈ ట్రిక్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి స్టార్ మా టీఆర్పీ పరంగా ప్రయోజనం పొందింది. కాబట్టి మరోసారి ఇదే స్ట్రాటజీ అమలు చేయనుందట. మరొక ఆసక్తికర విషయం హౌస్లో మూడు గదులు ఉంటాయట. ఈ మూడు గదులకు ఒక్కో పేరు, ప్రత్యేకత ఉంటాయట. 

Bigg boss telugu 8


గోల్డెన్ రూమ్ పేరుతో ఒక గది డిజైన్ చేశారట. ఈ గదిలో కంటెస్టెంట్స్ ప్రణాళికలు వేస్తారట. మరో రెండు సాధారణ గదులు ఉంటాయట. గోల్డెన్ రూమ్ కి తూనీగ అని పేరు పెట్టారట. నెమలి, జీబ్రా మిగతా రెండు గదుల పేర్లు అట. బహుశా గోల్డెన్ రూమ్ ప్రత్యేక సౌకర్యాలు కలిగి ఉండొచ్చు. సీజన్ 7లో వీఐపీ బెడ్ రూమ్ తో పాటు సాధారణ బెడ్ రూమ్ ఏర్పాటు చేశారు. కెప్టెన్ కి మాత్రమే వీఐపీ రూమ్ లోకి ఎంట్రీ ఉండేది. అలాగే కెప్టెన్ నియమించుకున్న అసిస్టెంట్ కూడా వాడుకోవచ్చు. 

సీజన్ 8లో అదే మాదిరి గోల్డెన్ రూమ్ కొందరు ప్రత్యేకమైన కంటెస్టెంట్స్ కి కేటాయించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1న ప్రసారం కానున్న బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ని భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తుంది. మరోవైపు నాగార్జున వరుసగా ఆరో సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. సీజన్ 3 నుండి నాగార్జున బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన లెక్క చేయడం లేదు. 

సంప్రదాయవాదులు బిగ్ బాస్ షోని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది మన సంస్కృతికి వ్యతిరేకం. యువత ఆలోచనల మీద చెడు ప్రభావం చూపుతుందని గగ్గోలు పెడుతున్నారు. సీపీఐ నారాయణ బిగ్ బాస్ హౌస్ ని బ్రోతల్ హౌస్ తో పోల్చడం సంచలనమైంది. నాగార్జున మీద పలుమార్లు నారాయణ కీలక ఆరోపణలు చేశారు. హోస్ట్ గా ఉన్నందుకు నాగార్జున పై అసహనం వ్యక్తం చేశారు..

click me!