miss world 2025
మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోవడం చాలామంది మోడల్స్ కల. ఈ టైటిల్ దక్కించుకోవడం కోసం ఎన్నో దేశాలు పోటీపడుతుంటాయి. పండగలా ఈ పోటీలను నిర్వహిస్తుంటారు. అయితే, ఈ పోటీలను ప్రారంభించింది ఎవరు? వీటిని మొదట ప్రారంభించింది ఏదేశంలోనో తెలుసా? లండన్‌కు చెందిన ఎరిక్ డాగ్లస్ మోర్లే టెలివిజన్ హోస్ట్ అయిన ఈయన, 1951లో ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ వేడుకల్లో భాగంగా స్విమ్‌సూట్ కాంటెస్ట్‌ను ఏర్పాటు చేశారట. అది మీడియాలో 'మిస్ వరల్డ్' పేరుతో బాగా పాపులరైంది. దాంతో ఆ పేరును రిజిస్టర్ చేయించి అన్ని పోటీలనూ ఈ పేరుతోనే నిర్వహించడం ప్రారంభించారు.
Miss World 2025
అయితే ఈ పోటీలపై స్టార్టింగ్ లో ఎన్నో వివాదాలు, విమర్శలు వచ్చాయట. కాని వాటిని పట్టించుకోకుండా అప్పటి నుంచి పోటీలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ పోటీమిస్ వరల్డ్ అవ్వాలనే ఆశయంతో జాతీయ స్థాయిలోనే ప్రతి సంవత్సరం పదిలక్షలకు పైగా అమ్మాయిలు పోటీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు అంటే.. ఈ పోటీలకు వరల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్ గురించి అర్ధం అవుతుంది. అంతే కాదు ప్రతీ ఏడాది దాదాపు 160 కంటే ఎక్కువ దేశాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.
మిస్ వరల్డ్ ఈవెంట్ ను ఫస్ట్ టైమ్ 1959 ప్రసారం చేశారు. ఆ కాలంలో ఎక్కవమంది చూసే కార్యక్రమం కూడా ఇదే. ఇక ఈ పోటీల్లో ఇండియా 6 మిస్ వరల్డ్ టైటిల్స్ ను గెలిచింది. 1994 లో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోగా, సుస్మితాసేన్ రీతా ఫారియా పావెల్, డయానా హేడెన్, యుక్తాముఖి, ప్రియాంకచోప్రా, మానుషీ చిల్లర్ ఈ ప్రతిష్ఠాత్మ టైటిల్ ను ఇండియాకు అందించారు.
ఇప్పటివరకూ ఎక్కువగా మిస్ వరల్డ్ టైటిళ్లు గెలుచుకున్న దేశాలు భారత్, వెనెజులా. ఈ రెండూ ఆరుసార్లు చొప్పున కిరీటాన్ని దక్కించుకున్నాయి.ఒకే పోటీలో మిస్ వరల్డ్‌తోపాటు మరో మూడు సబ్ టైటిళ్లు కూడా గెలుచుకున్న ఏకైక మహిళ డయానా హేడెన్. మిస్ వరల్డ్ - ఆసియా, ఓషీయానియా, మిస్ ఫొటోజెనిక్ అండ్ స్పెక్టాక్యులర్ స్విమ్‌వేర్ టైటిళ్లు సాధించిందీమె.
Miss World 2025 Hyderabad
ఇప్పటివరకూ ఎక్కువ కాలం మిస్ వరల్డ్‌గా కొనసాగింది జమైకాకు చెందిన టోనీ-ఆన్ సింగ్. ఈమె 2019లో టైటిల్ గెలుచుకున్న ఈమె 2021 వరకూ కొనసాగింది. కరోనా కారణంగా 2020 మిస్ వరల్డ్ రద్దు కావడంతో ఆమెకు ఈ అవకాశం దక్కింది. అతి కొద్ది కాలం వెస్ట్ జర్మనీకి చెందిన గబ్రీల్లా బ్రమ్ కొనసాగారు . 18ఏళ్ల ఈమె మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న 18గంటలకే రిజైన్ చేసిందట.