Bigg Boss Telugu 7
గత సీజన్లో పార్టిసిపేట్ చేసిన గీతూ రాయల్, శ్రీసత్యను కలిపితే రతికా రోజ్ అని చెప్పొచ్చు. ఈ అమ్మడు గేమ్, స్ట్రాటజీస్ భయంకరంగా ఉంటున్నాయి. తానంతట తానే పల్లవి ప్రశాంత్ ని గెలికింది... నీకు నా హృదయం ఇస్తా అంటూ సన్నిహితంగా మెలిగింది. తీరా ఎలిమినేషన్ లో ఏం పీకావ్ నువ్వు అంటూ నామినేట్ చేసింది. ఆ దెబ్బకు పల్లవి ప్రశాంత్ మైండ్ బ్లాక్ అయ్యింది.
Bigg Boss Telugu 7
ఓ వారం రోజులుగా తన ఫోకస్ ప్రిన్స్ యావర్ పై పెట్టింది. అతన్ని నవ్వులతో, తియ్యని మాటలతో మెల్ట్ చేసింది. ఆమె ఏం చేసినా రైట్ అంటున్నాడు యావర్. ట్విస్ట్ ఏంటంటే.. అతని విషయంలో కూడా రతికా నిజాయితీగా లేదు. బిగ్ బాస్ మూడో కంటెండర్ అయ్యే ఛాన్స్ అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ కి ఇచ్చాడు.
Bigg Boss Telugu 7
ఈ ముగ్గురిలో ఎవరు పవర్ అస్త్రకు అర్హులు కాదో కన్ఫెషన్ రూమ్ లో చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు. కన్ఫెషన్ రూమ్ లో చెబుతారు కాబట్టి కంటెస్టెంట్స్ ఎవరికి అర్హత లేదని చెప్పారో ఆ ముగ్గురికి తెలియదు. అనూహ్యంగా ప్రిన్స్ యావర్ పేరు చెప్పింది రతికా. తనతో గొడవపడే శోభా శెట్టి, అమర్ దీప్ లను కాదని సన్నిహితంగా ఉంటున్న ప్రిన్స్ యావర్ అనర్హుడని చెప్పింది.
Bigg Boss Telugu 7
కన్ఫెషన్ రూమ్ లో ఎవరెవరు ఎవరి పేరు చెప్పారో బిగ్ బాస్ వీడియోలు బహిర్గతం చేశాడు. అప్పుడు రతికా తన పేరు చెప్పిన విషయం యావర్ కి తెలిసింది. అయినా ఆమెపై కోప్పడలేదు. పైగా నీకు ఏమైనా నేనున్నా అంటూ హామీ ఇచ్చాడు. కిచెన్ లో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ చోటు చేసుకుంది.
Bigg Boss Telugu 7
రతికా కోసం వంట చేసిన యావర్ స్వయంగా ఆమెకు తినిపించాడు. ఒకే కంచంలో ఇద్దరూ తిన్నారు. అక్కడే ఉన్న పల్లవి ప్రశాంత్... మీ సరసాలు తగలెయ్యా, అంటూ పక్కకు వెళ్ళిపోయాడు. ఇక పవర్ అస్త్రకు అర్హుడు కాదని రతికా చెప్పిన తర్వాత కూడా ఆమెను ప్రేమిస్తున్నాడని కంటెస్టెంట్స్ వాపోయారు. శుభశ్రీ షాక్ కి గురైంది.
Bigg Boss Telugu 7
అయితే యావర్ జెన్యూన్ గా తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. రతికా మాత్రం కన్నింగ్ గేమ్ ఆడుతోందనిపిస్తుంది. పవర్ అస్త్ర గెలిచే ప్రక్రియలో భాగంగా ప్రిన్స్ యావర్ కి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. ఎవరు ఏం చేసినా అక్కడ నుండి ముఖం తీయకూడదని చెప్పాడు. అందరికంటే మొదటిగా రతికా రోజ్ అతని ముఖం మీద గుడ్డు పగలగొట్టింది...