ట్రాన్స్ ఫరెంట్ శారీలో జాన్వీ కపూర్‌ సెగలు పుట్టించే అందాలు.. విరహాన్ని ఒలకబోస్తూ స్టన్నింగ్‌ పోజులు

First Published | Sep 20, 2023, 2:54 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా రోజులవుతున్నా ఇప్పటి వరకు బ్రేక్‌ దక్కలేదు. సరైన బ్రేక్‌ కోసం వెయిట్ చేస్తున్న ఈ బ్యూటీ గ్లామర్‌ ట్రీట్‌లో మాత్రం తనలోని నెక్ట్స్ లెవల్ చూపిస్తుంది. 
 

బాలీవుడ్‌లో హాట్‌ బాంబ్‌లా మారుతున్న జాన్వీ కపూర్‌.. రెగ్యూలర్‌గా ఫోటో షూట్లు చేస్తూ అందాలతో నెటిజన్లపై దాడి చేస్తుంది. ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఊపిరాడకుండా చేస్తుంది. ఘాటు రేపే అందాలతో విజువల్‌ ట్రీట్‌ ఇస్తూ కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. 

తాజాగా జాన్వీ కపూర్‌ అదిరిపోయే పోజులిచ్చింది. పలుచని ఉల్లిపొరలాంటి శారీలో మెరిసింది. ట్రాన్స్ ఫరెంట్‌ శారీలో ఆమె విరహంతో కూడిన పోజులివ్వడం విశేషం. పిల్లర్‌కి వాలిపోతూ వోరగా చూస్తూ చూపులతోనే రెచ్చగొడుతుంది. కుర్రాళ్ల బాడీలో హీటు రాజేస్తుంది. దీంతో ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తుంది. 


జాన్వీ కపూర్‌.. మంగళవారం రాత్రి అంబానీ ఇంట్లో వేడుకలో పాల్గొంది. వినాయక చవితికి సంబంధించిన సెలబ్రిటీ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో చాలా మంది బాలీవుడ్‌ స్టార్స్ పాల్గొని సందడి చేశారు. దీంతో అంతా పండగ వాతావరణమే కనిపించింది. ఈ సందర్భంగా కెమెరాకి పోజులివ్వగా, ఆయా పిక్స్ ని అభిమానులతో పంచుకుంది జాన్వీ కపూర్. 
 

జాన్వీ.. కపూర్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `దేవర` చిత్రంలో నటిస్తుంది. ఎన్టీఆర్‌ సరసన ఆమె హీరోయిన్‌గా నటిస్తుంది. ఎంట్రీనే పెద్ద స్టార్‌ హీరోతో కావడం విశేషం. దీంతో ఆమె గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతుందని చెప్పొచ్చు. ఈ సినిమా పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతుంది. అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. దీంతో పాన్‌ ఇండియా ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తుంది.
 

ఇక జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చి ఐదేళ్లు అవుతుంది. కానీ ఈ బ్యూటీకి ఇప్పటి వరకు సరైన హిట్‌ పడలేదు. చెప్పుకోదగ్గ సక్సెస్‌ రాలేదు. దీంతో మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తుంది. నటించిన చిత్రాలన్నీ యావరేజ్‌గా, డిజాస్టర్లుగానే నిలిచాయి. ఇటీవల వరుణ్‌ ధావన్‌తో కలిసి నటించిన చిత్రం కూడా యావరేజ్‌ పలితాన్నే చూసింది. 

ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ ఇప్పుడు ఎన్టీఆర్‌పైనే ఆశలన్నీ పెట్టుకుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సముద్రం నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్నారు. ఇందులో జాన్వీ పాత్రకి కూడా చాలా ప్రయారిటీ ఉంటుందట. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల తారక్‌ దుబాయ్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన తిరిగొచ్చారు. దీంతో మళ్లీ చిత్రీకరణ లో పాల్గొంటారని సమాచారం. 

జాన్వీ కపూర్‌ నిజానికి గతేడాదిలోనే టాలీవుడ్‌ ఎంట్రా ఇవ్వాల్సింది. విజయ్‌ దేవరకొండతో `లైగర్‌`మూవీ కోసం అడిగారు. ఆ సమయంలో డేట్స్ సెట్‌ కాకపోవడంతో చేయలేకపోయింది. కానీ ఆ సినిమా పరాజయం చెందడంతో అలా జరగడం జాన్వీకి ప్లస్సే అయ్యింది.  ఇదిలా ఉంటే తల్లి శ్రీదేవి పాన్ ఇండియా హీరోయిన్‌గా వెలిగింది. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, నార్త్ భాషల్లోనూ నటించింది. లేడీ సూపర్‌ స్టార్‌గా వెలిగింది. ఇప్పుడు తల్లిబాటలోనే తాను నడవాలని కలలు కంటుంది జాన్వీ. మరి ఆ స్థాయికి చేరుకుంటుందా చూడాలి. 
 

Latest Videos

click me!