బ్లాక్ శారీలో అదిరిన ‘బిగ్ బాస్’ బ్యూటీ ఫోజులు.. చీరకట్టి మైమరిపిస్తున్న దేత్తడి హారిక

First Published | Sep 20, 2023, 3:43 PM IST

బిగ్ బాస్ హారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది. మరోవైపు నయా లుక్స్ లో మెరుస్తూ మైమరిపిస్తోంది. తాజాగా చీరకట్టి దర్శనమిచ్చింది. 
 

‘దేత్తడి’ యూట్యూబ్ ఛానెల్ తో అలేఖ్య హారిక (Alekhya Harika)  పాపులర్ అయ్యింది. షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోలు చేస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. తెలంగాణ యాస, భాషలో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది.
 

మాస్ పిల్లగా ముద్రవేసుకున్న దేత్తడి హారికకు యూట్యూబ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో పాపులర్ రియాలిటీ షో Bigg Boss Teluguలో అవకాశం వచ్చింది. దాంతో టీవీ ఆడియెన్స్ కు కూడా బాగా దగ్గరైంది.
 


బిగ్ బాస్ సీజన్ 4లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన ఆటతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. ప్రతి టాస్క్ లోనూ అద్భుతంగా ఆడి తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చింది. చివరి వరకు నిలిచి హౌజ్ ను వీడింది.
 

హౌజ్ నుంచి బయటికి వచ్చాక హారిక క్రేజ్ మరింతగా పెరిగింది. దానికితోడు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ తరుచూ ఫొటోషూట్లతో దర్శనమిస్తోంది. గ్లామర్ వెదజల్లుతూ నెటిజన్లూ ఫిదా చేస్తోంది. దీంతో మరింతగా ఫాలోయింగ్ పెరుగుతోంది.
 

తాజాగా హారిక ఓ హోటల్ రూమ్ లో చీరకట్టులో మెరిసింది. ట్రాన్స్ ఫరెంట్ బ్లాక్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మిర్రర్ ముందు సెల్ఫీలు దిగుతూ ఆకట్టుకుంది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

చీరకట్టులో చాలా కాలం తర్వాత బిగ్ బాస్ హారిక ఫ్యాన్స్ కు దర్శనమివ్వడంతో ఖుషీ అవుతున్నారు. ఆమె శారీ లుక్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఆ ఫొటోలను లైక్ చేస్తూ వైరల్ గా మారుస్తున్నారు. చివరిగా ఈ బ్యూటీ ‘గానం’ అనే చిత్రంతో పాటు, ‘వెళ్లకే’ అనే మ్యూజిక్ వీడియోలో మెరిసింది.
 

Latest Videos

click me!