మొదలైన బిగ్ బాస్ ఫినాలే షూట్, 20 లక్షలు ఆఫర్ చేసిన శ్రీముఖి..ఎవరు తీసుకుని ఎలిమినేట్ అయ్యారంటే..

First Published | Dec 15, 2023, 1:38 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఆదివారం రోజు ప్రసారం కానుంది. 100 రోజులకి పైగా అలరించిన సీజన్ 7 లో విజేత ఎవరనేది ఆ రోజు తేలిపోనుంది. టాలీవుడ్ నుంచి కొందరు ప్రముఖులు అతిథులుగా ఫినాలేకి హాజరు కాబోతున్నట్లు టాక్. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఆదివారం రోజు ప్రసారం కానుంది. 100 రోజులకి పైగా అలరించిన సీజన్ 7 లో విజేత ఎవరనేది ఆ రోజు తేలిపోనుంది. టాలీవుడ్ నుంచి కొందరు ప్రముఖులు అతిథులుగా ఫినాలేకి హాజరు కాబోతున్నట్లు టాక్. 

అయితే తాజా సమాచారం మేరకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. ఫైనల్ షూటింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఫినాలేలో ముగ్గురు నలుగురు సభ్యులు హౌస్ లో ఉన్నప్పుడు నాగార్జున కొందరు గెస్ట్ లని లోపలికి పంపించడం జరుగుతుంది. 


హౌస్ మేట్స్ కి డబ్బు ఆశ చూపించి ఎవరో ఒకరిని తప్పుకునేలా టెంప్ట్ చేస్తారు. సాధారణంగా ఈ ప్రాసెస్ ఎపిసోడ్ మిడిల్ గా సాగుతోంది. కానీ సీజన్ 7 లో ఫైనల్ ఎపిసోడ్ ఆరంభం నుంచే హీట్ పెంచేశారట. ఫినాలే బిగినింగ్ లోనే యాంకర్ శ్రీముఖి హౌస్  లోపలికి వెళుతుంది. తన రూ.20 లక్షల నగదు ఉన్న సూట్ కేస్ తీసుకువెళుతుంది. 

Bigg Boss Telugu 7

మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అంటూ రూమర్స్ వచ్చాయి కానీ అలాంటిది ఏమీ లేదు. ప్రస్తుతం ఫినాలే వరకు హౌస్ లో 6 గురు సభ్యులు ఉన్నారు. ఈ 6 గురుకి శ్రీముఖి 20 లక్షల డబ్బు ఆశచూపించింది. ఎవరైనా డ్రాప్ అయితే ఏ డబ్బు వారి సొంతం అంటూ టెంప్ట్ చేసింది. కానీ శ్రీముఖి ఆఫర్ ని అందరూ రిజెక్ట్ చేశారు. 

ఓటింగ్ లో లాస్ట్ లో ఉన్నామని భావించే వాళ్లకు ఇది గోల్డెన్ ఆఫర్ అంటూ శ్రీముఖి బాగా కవ్వించింది. కానీ ఎవ్వరూ ఆ డబ్బుతో ఎలిమినేట్ అయ్యేందుకు ఆసక్తి చూపలేదు. బిగినింగ్ లోనే ఇలా ఉంటే ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యే కొద్దీ ఆఫర్ పెరగడం ఖాయం. 

Bigg Boss Telugu 7

గ్లామర్ సెలెబ్రిటీల ఆటపాటలు, ఉత్కంఠ రేకెత్తించేలా సాగే ఒక్కొక్కరి ఎలిమినేషన్, బడా సెలెబ్రిటీల సందడి, విన్నర్ ని అనౌన్స్ చేయడం ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఈ సీజన్ లో గ్రాండ్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. 

Latest Videos

click me!