Bigg Boss7: గ్రాండ్ ఫినాలే కి ముహూర్తం ఫిక్స్..ముగ్గురు మాత్రమే, ఎవరూ ఊహించని ట్విస్ట్ తో ఆ రోజే ?

First Published | Nov 23, 2023, 8:11 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 అత్యంత రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ గత సీజన్లు చాలా నిరాశపరిచాయి. కానీ సీజన్ 7 మాత్రం మంచి వినోదం అందిస్తూ దూసుకుపోతోంది.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 అత్యంత రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ గత సీజన్లు చాలా నిరాశపరిచాయి. కానీ సీజన్ 7 మాత్రం మంచి వినోదం అందిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం సీజన్ 7 చివరి దశకి చేరుకుంది అని చెప్పాల్సిందే. 

ప్రస్తుతం హౌస్ లో 10 మంది సభ్యులు మిగిలారు. శివాజీ, ప్రశాంత్, ప్రియాంక, శోభా శెట్టి, యావర్ లు టాప్ 5 లో ఉంటారనే అంచనాలు వినిపిస్తున్నాయి. గౌతమ్, అమర్ డీప్, అర్జున్, అశ్విని , రతిక మిగిలిన కంటెస్టెంట్స్ గా ఉన్నారు. అయితే టాప్ 5 అంచనాలు మారే అవకాశం ఉంది. దీనితో టాప్ 5 కి ఎవరు చేరుకుంటారు అనే ఆసక్తి సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. 


సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతుండడంతో కొన్ని వారలు పొడిగించాలి అని కూడా చర్చలు జరిగాయట. కానీ ఆ ఆలోచనని విరమించుకున్నట్లు తెలుస్తోంది. 

దీనితో సీజన్ 7 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17న నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఫినాలే గురించి ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ ఉండబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

ప్రతి సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఫైనల్ వరకు ఉంటారు. కానీ ఈ సీజన్ ఉల్టా పల్టా కాబట్టి టాప్ 7 ని ఫైనల్ కి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ లాంటి వాళ్లకు కూడా ఫైనల్ చేరుకునే ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేట్ అయి తిరిగి వచ్చిన రతికకి కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం హౌస్ లో ఉన్న 10 మందిలో ఇక ముగ్గురు మాత్రమే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. 

మొత్తంగా సీజన్ గ్రాండ్ ఫినాలే అత్యంత ఆసక్తి రేపడం ఖాయం. విజేత ఎవరు అనే విషయంలో అభిమానులు ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సారైనా లేడి కంటెస్టెంట్స్ విజయం సాధిస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. 

Latest Videos

click me!