అనసూయ అక్కడున్న జనాన్ని, అభిమానులని ఉద్దేశించి మాట్లాడింది. మా ఆయనతో కలసి నేను అప్పుడప్పుడూ ఇక్కడకి వస్తుంటా. ఎందుకంటే ఇక్కడ మాకు ల్యాండ్స్ ఉన్నాయి అంటూ ఆస్తుల సీక్రెట్ బయట పెట్టింది.
టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరిని మెప్పిస్తోంది.
210
గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.
310
అయితే తన అందాలతో యువతని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు అనసూయ సోషల్ మీడియాని ఎంచుకుంది. ఇంస్టాగ్రామ్ లో అనసూయ ఇచ్చే ఫోజులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
410
ఇక రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.
510
వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.
610
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తరచుగా ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళుతూ ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం.
710
ఇక అనసూయ లాంటి టాప్ గ్లామర్ యాంకర్ కి షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, ఇతర వాణిజ్య కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి. సినీ తారలు ఈ రకమైన ప్రకటనలతో బాగానే సొమ్ము చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల రాయచోటిలో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన అనసూయ.. తాజాగా షాద్ నగర్ లో మరో మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది.
810
దీనితో ఆ ప్రాంతం జనజాతరని తలపించేలా మారింది. అనసూయ రాగానే ఆమెపై డ్రోన్ తో పూల వర్షం కురిపించారు. అభిమానుల కేరింతలతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. అనసూయ ని చూడగానే యువత కేరింతలు కొట్టారు.
910
షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత అనసూయ అక్కడున్న జనాన్ని, అభిమానులని ఉద్దేశించి మాట్లాడింది. షాద్ నగర్ అంటే తనకు ప్రత్యేకంగా చాలా ఇష్టం అని పేర్కొంది. క్షణం చిత్ర క్లైమాక్స్ ని ఇక్కడే షూట్ చేశాం.
1010
ఆ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అలాగే మా ఆయనతో కలసి నేను అప్పుడప్పుడూ ఇక్కడకి వస్తుంటా. ఎందుకంటే ఇక్కడ మాకు ల్యాండ్స్ ఉన్నాయి అంటూ ఆస్తుల సీక్రెట్ బయట పెట్టింది. షాద్ నగర్ లో డాబా ఫుడ్ అంటే కూడా తనకి ఇష్టం అని అనసూయ పేర్కొంది.