60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?

Published : May 27, 2025, 02:49 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇంకాస్త యవ్వనంగా కనిపించే హీరోలు కొంత మంది ఉన్నారు.  అయితే 60 ఏళ్ళకు అడుగు దూరంలో ఉన్న ఒక హీరో  సిక్స్ ప్యాక్ తో సందడి చేస్తున్నారు. తాజాగా తన  ఫిట్ నెస్ సీక్రేట్ ను కూడా పంచుకున్నారు. ఇంతకీ ఎవరా హీరో?

PREV
15

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈ వయసులోనూ యంగ్ హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం 59 ఏళ్లు ఉన్నా షారుఖ్ త్వరలో 60లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. ఈ ఏజ్ లో కూడా తన ఫిట్‌నెస్, స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ఇటీవలే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'జవాన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్న షారుఖ్ కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా బిజీగా గడుపుతున్నారు.

25

తాజాగా షారుఖ్ తన ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి మాట్లాడారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – "నాకు ప్రత్యేకమైన డైట్ ప్లాన్ ఉంది. రోజుకు రెండు పూటల భోజనం మాత్రమే చేస్తాను. మధ్యాహ్నం , రాత్రి మాత్రమే తింటాను. జంక్ ఫుడ్ అస్సలు తినను. నా డైట్‌లో ప్రధానంగా మొలకెత్తిన ధాన్యాలు, గ్రిల్డ్ చికెన్, బ్రోకలీ ఉంటాయి. అప్పుడప్పుడూ కొంత మంది ఇచ్చే చిక్కుళ్లు కూడా తింటాను" అని చెప్పారు.

35

అతిథుల ఇళ్లకు వెళ్లినప్పుడు లేదా విమాన ప్రయాణాల్లో కూడా ఏ ఆహారమైనా ఇచ్చినా తాను అంగీకరిస్తానని, ఎప్పుడూ నో చెప్పనని తెలిపారు. "బిర్యానీ, రోటీ, నెయ్యి, లస్సీ... ఏదైనా ఇవ్వొచ్చు. నేను తినేస్తాను. కానీ ఓ మోస్తరుగా మాత్రమే తింటాను. ఎక్కువగా నియమాలు పెట్టుకోను. నేను తీసుకునే ఆహారంపై శ్రద్ధతో ఉంటాను" అని షారుఖ్ అన్నారు.

45

అలాగే, ఒకే ఆహారాన్ని రోజుకు రెండుసార్లు తినడం వల్ల తనకు ఎలాంటి అసౌకర్యం ఉండదని తెలిపారు. షారుఖ్ డైట్ ప్లాన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయన డైట్ ప్లాన్ ను ఫాలో అవ్వడానికి రెడీ అవుతున్నారు. అంతే కాదు ఏజ్ పెరిగినా కూడా యాక్టివ్‌గా ఉండేందుకు వ్యాయామంతో పాటు సరైన ఆహారమే కీలకమని షారుఖ్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

55

తన వయసుకు అనుగుణంగా సిక్స్ ప్యాక్ బాడీ ను కాపాడుకుంటూ, ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా. ఆయన సిక్ ఫ్యాక్స్ లుక్స్ తో పాటు డైట్ ప్లాప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిట్‌నెస్ విషయంలో ఆయన చూపిన అంకితభావం అందరికీ ప్రేరణగా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories