53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?

Published : May 27, 2025, 11:24 AM IST

ఆ హీరోయిన్ వయసు 53 ఏళ్లు, ఆ యంగ్ స్టార్ వయసు 29 ఏళ్లు, ఈ ఇద్దరు కలిసి నటించిన సీన్స్ నెట్టింట రచ్చ రచ్చ అవుతున్నాయి. 24 ఏళ్ల  గ్యాప్ ఉన్నా, రెచ్చిపోయి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు ఇద్దరు తారలు. ఈ విషయంపై ఆ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. 

PREV
15

53 ఏళ్ల సీనియర్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో కాదు టబు. ఆమె కంటే 24 ఏళ్ల చిన్న హీరో ఎవరో కాదు బాలీవుడ్ యంగ్ స్టార్ ఇషాన్ ఖట్టర్. తాజాగా టబుతో రొమాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి మరోసారి వైరల్ న్యూస్ అయ్యాడు ఇషాన్. ‘ధడక్’ సినిమాతో హీరోగా సినీప్రియుల ముందుకొచ్చిన ఇషాన్, ప్రస్తుతం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన ‘హోమ్ బౌండ్ మూవీ 78వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ అయ్యింది.

25

రీసెంట్ గా తన కెరీర్‌లో గుర్తుండిపోయే వెబ్ సిరీస్ ‘ఎ సూటబుల్ బాయ్’ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఇషాన్. దీని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఆడియన్స్ తో షేర్ చేసుకున్నాడు. ఆ సిరీస్‌లో టబుతో కలిసి చేసిన రొమాంటిక్ సీన్స్ పై స్పందించారు. టబు తనకంటే 24 ఏళ్లు పెద్దది అయినా, వారిద్దరి మధ్య వయసు తేడా తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఆయన అన్నారు.

35

ఇషాన్ ఖట్టర్ మాట్లాడుతూ,..ఇలాంటి సన్నివేశాలు చూసి ప్రేక్షకులకు వింతగా అనిపించొచ్చు. కానీ ఆ కథను రాసిన తీరు ఆ సన్నివేశానికి పూర్తి న్యాయం చేసింది. మేము వయసు తేడా గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. టబుతో నటించడం అంటే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమెతో నటిస్తే ఎంతో సేఫ్‌గా ఫీలవుతాను. ఏ సీన్ చేస్తున్నామో అర్థం చేసుకునే నటి ఆమె. అందుకే నేనూ కంఫర్ట్‌గా ఫీల్ అయ్యాను” అని అన్నారు.

45

టబు గురించి మాట్లాడుతూ, “ఆమె చాలా సరదాగా ఉంటారు. సెట్‌లో పిల్లలా ప్రవర్తిస్తారు. జోక్స్ వేస్తారు. కానీ సీన్ లోకి రాగనే వెంటనే పాత్రలో పూర్తిగా లీనమైపోతారు. ఆమెతో పనిచేయడం నాకు మంచి అనుభవం” అని ఇషాన్ అన్నారు.

55

ఇషాన్ ప్రస్తుతం ‘ది రాయల్స్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు, ‘హోమ్ బౌండ్’ వంటి ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు యంగ్ హీరో. ‘హోమ్ బౌండ్’ చిత్రం కేన్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. ఈసినిమాతో బాలీవుడ్‌లో ఇషాన్ ఇమేజ్ మరింత పెరిగింది. వయస్సు, అనుభవం అనే అంశాలను పక్కన పెడితే.. ఇండస్ట్రీలో చాలా సైలెంట్ గా ఎదుగుతున్నాడు యంగ్ స్టార్. తన నటనతో పాటు, యాటీట్యూడ్ తో కూడా ఫ్యాన్స ను బుట్టలో వేస్తున్నాడు ఇషాన్.

Read more Photos on
click me!

Recommended Stories