బుల్లితెర మీద కార్తీకదీపం ఒక సెన్సేషన్. నేషనల్ వైడ్ రికార్డ్స్ నెలకొల్పిన సీరియల్ అది. సదరు సీరియల్ లో నటించిన విలన్ మోనిత పాత్ర జనాలకు బాగా సుపరిచితం. డాక్టర్ బాబు, వంటలక్క ఎంత ఫేమస్సో... మోనిత కూడా అంతే ఫేమస్. మోనిత పాత్ర చేసిన కన్నడ నటి శోభా శెట్టి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.