Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ కి పెళ్లయిందా? ఇదేం ట్విస్ట్ సామీ!

First Published | Oct 15, 2023, 10:18 AM IST

పల్లవి ప్రశాంత్ పెళ్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇతడు పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడని జనాలు షాక్ అవుతున్నారు. 
 


రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. ఆ హోదాతో బిగ్ బాస్ సీజన్ 7లో అవకాశం దక్కించుకున్నాడు. మొదట్లో పల్లవి ప్రశాంత్ విమర్శలు ఎదుర్కొన్నాడు. సింపతీ గేమ్ ఆడుతున్నాడు. అమ్మాయిలతో పులిహోర కలుపుతున్నాడంటూ ట్రోల్స్ కి గురయ్యాడు. 

Bigg Boss Telugu 7

అయితే విమర్శలకు చెక్ పెడుతూ పల్లవి ప్రశాంత్ గొప్ప ఆటగాడిగా ఎదిగాడు. నాలుగో పవర్ అస్త్ర పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. రెండు వారాల ఇమ్యూనిటీ గెలుచుకున్నాడు. అలాగే పోరాడి గెలిచి ఇంటి ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఇది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. 


Bigg Boss Telugu 7


హోస్ట్ నాగార్జున కూడా పల్లవి ప్రశాంత్ గేమ్ పట్ల సంతృప్తిగా ఉన్నాడు. ఆరు వారాలు ముగియగా పల్లవి ప్రశాంత్ చాలా మంది ఇతర కంటెస్టెంట్స్ కంటే మెరుగ్గా ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ కి పెళ్లైయిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది. 

Bigg Boss Telugu 7

దీంతో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సదరు ఫోటోలో పల్లవి ప్రశాంత్ భార్యతో పాటు కనిపిస్తున్నాడు. పెళ్లి బట్టల్లో వధువు పక్కన మెరిసిపోతున్నారు. అరె పల్లవి ప్రశాంత్ కి ఎప్పుడు పెళ్లయింది. మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదని పలువురు వాపోతున్నారు. 

Bigg Boss Telugu 7

ఇటీవల పల్లవి ప్రశాంత్ తండ్రి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. మేము కోటీశ్వరులమని వస్తున్న వార్తల్లో నిజం లేదు. పల్లవి ప్రశాంత్ మంచివాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక పెళ్లి చేస్తాం... అని ఆయన అన్నారు. తండ్రి మాటల ప్రకారం కూడా పల్లవి ప్రశాంత్ కి వివాహం కాలేదు. 

Bigg Boss Telugu 7

కాబట్టి ఇది మార్ఫింగ్ ఫోటో కావచ్చు. లేదా పల్లవి ప్రశాంత్ ఏదైనా షార్ట్ ఫిల్మ్, ప్రమోషనల్ వీడియోలో నటించి ఉండొచ్చని అనుమానాలు కలుగుతున్నాయి. కాగా పల్లవి ప్రశాంత్ కి సినిమా ఆఫర్ కూడా వచ్చినట్లు ఇటీవల భోలే షావలి బిగ్ బాస్ హౌస్లో చెప్పారు. 
 

Latest Videos

click me!