వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ఉంది బిగ్ బాస్. బుల్లితెర ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ షో అయిన బిగ్ బాస్ కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నాలుగు గోడల మధ్య కంటెస్టెంట్స్ మానసికంగా, శారీరకంగా శ్రమించాల్సి ఉంటుంది. కోపం, ఏడుపు, నిస్సహాయతను ఎదుర్కోవాలి. అవమానాలు, విమర్శలు చాలా కామన్. వందకు పైగా దినాలు బాహ్యప్రపంచానికి, అయినవారికి, ఆప్తులకు దూరంగా బ్రతకడం అంత సులభమేమీ కాదు.