నా చావు నేను చస్తా.. మీ చావు మీరు చావండి.. ఆషురెడ్డి కాలుకి ముద్దుపై ఆర్జీవి వివరణ.. బోల్డ్ కామెంట్స్

Published : Dec 11, 2022, 02:58 PM IST

రామ్‌గోపాల్‌ వర్మ అంటేనే సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్‌. ఇటీవల బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషురెడ్డి కాలుకి ముదుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై వర్మ స్పందించారు. బోల్డ్ మరోసారి బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.   

PREV
16
నా చావు నేను చస్తా.. మీ చావు మీరు చావండి.. ఆషురెడ్డి కాలుకి ముద్దుపై ఆర్జీవి వివరణ.. బోల్డ్ కామెంట్స్

ఆర్జీవి ఇటీవల ఆషురెడ్డితో చేసిన ఇంటర్వ్యూ దుమారం రేపింది. ఇందులో ఆమెతో కలిసి బోల్డ్ గా వ్యవహరించాడు వర్మ. ఆషురెడ్డి అందమైన కాలుకి ముద్దు పెట్టాడు. ఆమె కాలుని నోట్లో పెట్టుకుని మరీ పదాలు వాడలేనంతగా బిహేవ్‌ చేశారు. అయితే ఈ విషయంలో ఆషురెడ్డి కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆయనకు సపోర్ట్ చేయడం విశేషం. ఈ వీడియో రెండు మూడు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది. 

26

రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన `ది డేంజరస్` మూవీ ఈ నెల 9న విడుదల అయిన నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్‌ కోసం ఈ విచిత్రమైన ఇంటర్వ్యూ ప్లాన్‌ చేశారు వర్మ. ఆషురెడ్డితో చిట్‌చాట్‌తోపాటు ఆమె అందాన్ని వర్ణించాడు. అంతేకాదు ఆమె పెళ్లి చేసుకోవద్దని, ఆ విషయంలో జెలసీగా ఫీలవుతానని తెలిపాడు. ఆమె బాడీ మరొకరికి సొంతం కావడాన్ని తాను తట్టుకోలేనని వెల్లడించారు. అంతేకాదు ఆమె అందాలపై కూడా ఆయన హాట్‌ కామెంట్లు చేశారు. ఈ వీడియో, వర్మ మాటలు వైరల్‌గా మారడంతోపాటు ట్రోల్స్, మీమ్స్ కి స్టఫ్‌గా మారాయి. దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి. 
 

36

ఈ నేపథ్యంలో తాజాగా వర్మ స్పందించారు. తాను ఆషురెడ్డి కాలుకు ఎందుకు ముద్దు పెట్టానో వివరించాడు వర్మ. సుధీర్ఘంగా ఇచ్చిన వివరణలో వర్మ.. తాను ఎంటర్‌టైన్‌ చేయడం కోసమే ఇలా చేశానని వెల్లడించారు. ఆషురెడ్డి, తాను అడల్ట్ అని, ఇప్పుడు ఎవరికి వారు వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయని, తాము ఇద్దరం అంగీకారంతోనే చేశామని తెలిపారు. అలా చేయడానికి తమ ఇద్దరికి అభ్యంతరం ఉండాలి, లేదంటే మా చుట్టూ ఉన్న టీమ్‌కి అభ్యంతరం ఉండాలి, అంతేకాని మిగిలిన వారికి సమస్య ఏంటని ప్రశ్నించారు. 
 

46

ఆ వీడియోని చూడాలనిపిస్తే చూడండి, లేదంటే వదిలేయండన్నారు. మీకు ఏం పని పాట లేదా? అంటూ ఎదురుప్రశ్నించాడు. తమ ఇద్దరి అంగీకారంతో తమ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన అది అని తెలిపారు. అంతేకాదు తాను పెరిగిన విధానం, తాను నేర్చుకున్న విషయాలను బట్టి తనకంటూ ఓ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ ఉందని, ఆ ప్రకారమే తాను చేస్తానన్నారు. ఆ టైమ్‌లో తనకు ఏమనిపిస్తే అది చేస్తానని తెలిపారు. 

56

ఆషురెడ్డితో అలా చేయడమనేది ఆ సమయంలో తనకు కలిగిన ఫీలింగ్‌ అని, తనకు ఆమె గురించి చెప్పాలనుకున్న విషయాలను, తన ఫీలింగ్‌ని మాటల్లో చెప్పానని వెల్లడించారు. అదే సమయంలో ఎంటర్‌టైన్‌ అవ్వడానికి, ఎంటర్‌టైన్‌ చేయడానికి ఎవరికి వాళ్లకి తమకంటూ ఓ టేస్ట్ ఉంటుందని, ఒక్కొక్కరు ఒక్కో అంశాన్ని ఎంచుకుంటారని, తాను ఇలా చేయాలని ఎంచుకున్నట్టు తెలిపారు వర్మ. తాను అందమైన అమ్మాయితో ఇలా చేయాలనిపించిందని, అందుకే చేశానని వెల్లడించారు వర్మ. 

66

తాను చేసినదాన్ని నచ్చితే చూడండి అని, నచ్చకపోతే వదిలేయండి, తనని కూడా అన్‌ ఫాలో కావచ్చు అని చెప్పారు. తాను ఫాలోయింగ్‌ని నమ్మనని తెలిపారు. వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగత పర్సనాలిటీ లేని వారే ఇతరులను ఫాలో అవుతుంటారని చురకలంటించారు వర్మ. ఇక చివరగా తనదైన స్టయిల్‌లో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చారు. నా చావు నేను చస్తా, మీ చావు మీరు చావండి` అని తెలిపారు ఆర్జీవి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories