Bigg Boss Telugu 6: ఐదు వారాలకు చలాకీ చంటి ఎన్ని లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా!

Published : Oct 10, 2022, 07:43 PM IST

అనూహ్యంగా టాప్ సెలబ్రిటీ చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యాడు. టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన చంటి జర్నీ ఐదు వారాలకే ముగిసింది. మరి ఈ ఐదు వారాలకు చంటి ఎంత తీసుకున్నారనే విషయమై ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.   

PREV
15
Bigg Boss Telugu 6: ఐదు వారాలకు చలాకీ చంటి ఎన్ని లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా!
Bigg Boss Telugu 6

బిగ్ బాస్ హౌస్ లో చలాకీ చంటి జర్నీ చాలా త్వరగా ముగిసింది. టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన ఈ సెలెబ్రిటీ ఉసూరుమనిపించాడు. ఈ ఆదివారం చలాకీ చంటి ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించగా... మూటాముల్లె సర్దేశాడు. 21 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు 6 ప్రారంభమైంది. వీరిలో బాగా తెలిసిన ముఖాల్లో చంటి మొదటిస్థానంలో ఉంటాడు. జబర్దస్త్ షోతో పాటు బుల్లితెర ఈవెంట్స్, షోస్ ఆయనకు విపరీతమైన పాపులారిటీ తెచ్చాయి. ఫార్మ్ లో ఉన్న కమెడియన్ కాబట్టి బుల్లితెర ప్రేక్షకులకు బాగా క్లోజ్. 
 

25
Bigg Boss Telugu 6


రేవంత్, కీర్తి, బాల ఆదిత్యల కంటే కూడా చంటికే ఎక్కువ ఫాలోయింగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈజీగా ఫైనల్ కి చేరవచ్చు. ఇక చంటి ఎనర్జీ గురించి తెలిసిన వారు ఎవరైనా ఆయన హౌస్ లో అల్లాడిస్తాడు అనుకుంటారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసేలా ఆయన పెర్ఫార్మన్స్ ఉంది. బిగ్ బాస్ హౌస్, ఆ గేమ్స్, కంటెస్టెంట్స్ తో ప్రవర్తన వంటి విషయాలు చంటికి వంటబట్టలేదు. 
 

35
Bigg Boss Telugu 6


హౌస్ లో ఉన్నవాళ్లందరికంటే వయసులో పెద్దవాడైన చంటి అందరితో మంచి రిలేషన్స్ మైంటైన్ చేశాడు. నిర్వాహకులకు అది నచ్చని విషయం. కంటెస్టెంట్ అనేవాడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రెస్ లా ఉండాలి. ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ స్పైసీ కంటెంట్ ఇవ్వాలి. వయసులో ఉన్నోళ్లయితే ఎఫైర్ పెట్టుకోవాలి. బిగ్ బాస్ గేమ్ కి కావలసిన ఒక్క లక్షణం కూడా చంటిలో లేదు. అందులోనూ ఆయన డల్ గా ఇంట్రెస్ట్ లేనట్లు కనిపిస్తారు. 
 

45
Bigg Boss Telugu 6

బయటికి పంపిస్తే వెళ్ళిపోతా అన్న చంటి, శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ముందే తాను ప్లాప్ అని ఒప్పుకున్నాడు. అప్పుడే చంటి ఎలిమినేషన్ కి నాంది పడింది. చంటికి ఓట్లు రాకపోవడంతో ఎలిమినేట్ చేశారని నమ్మలేం. ఎలిమినేషన్ కి నామినేటైన 8 మందిలో చంటికే ఎక్కువ పాపులారిటీ ఉంది. ఏది ఏమైనా చంటి బిగ్ బాస్ షో ప్రయాణం ముగిసింది. కాగా ఐదు వారాలు హౌస్లో ఉన్నందుకు చంటి ఎంత తీసుకున్నారనే విషయంలో ఓ ఫిగర్ చక్కర్లు కొడుతుంది.

55
Bigg Boss Telugu 6


చంటి వారానికి రూ.1.5 నుండి 2 లక్షల ఒప్పందంపై హౌస్లోకి వచ్చాడట. ఆ విధంగా చంటి ఐదు వారాలకు రూ. 7.5 నుండి 10 లక్షలు పారితోషికంగా అందుకున్నాడట. కమెడియన్ గా సినిమాలు, షోలతో బిజీగా ఉన్న చంటికి ఇంత మొత్తంలో ఇవ్వడానికి నిర్వాహకులు ఆసక్తి చూపించారట. కాగా ఇకపై చంటి జబర్దస్త్ లో కనిపిస్తాడా లేదా అనే సస్పెన్సు అందరిలో ఉంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories