వాళ్ళను దూరం నుండి గమనిస్తున్న శ్రీహాన్, నేహా చౌదరి డిస్కషన్ పెట్టారు. అర్జున్ కపూర్ ని ఉద్దేశించి.. ఏంటి అతడు? అని నేహా అనగా... అర్జున్ కి శ్రీసత్య మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పాడు. శ్రీహాన్ అన్న దాన్ని పొడిగిస్తూ నేహా... అందుకే ఆ అమ్మాయి ఎమన్నా వావ్, వహ్వా, సూపర్ అంటున్నాడని చెప్పింది. వాళ్ళ మాటలను బట్టి చూస్తే అర్జున్ కపూర్ శ్రీ సత్య కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడని అర్థం అవుతుంది.