తన ఒరిజినల్ స్కిన్ గ్లో బయటపెట్టిన అమలాపాల్.. సాగరతీరంలో డస్కీ బ్యూటీ టెంప్టింగ్ ఫోజులు

First Published Sep 22, 2022, 1:15 PM IST

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. 

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది.  గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 
 

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.  

అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. 

ప్రస్తుతం అమలాపాల్ మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అందమైన సాగరతీరంలో రిసార్ట్ వద్ద సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ మెరుపులు మెరిపిస్తోంది. అమలాపాల్ సహజంగా డస్కీ అందాలతో బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ ఫోటోషూట్ లో అమలాపాల్ తనలోని ఒరిజినల్ డస్కీ బ్యూటీని బయట పెట్టింది. 

లాంగ్ గౌన్ లో పిల్లగానిలి ఆస్వాదిస్తూ హాట్ లిప్స్, డస్కీ స్కిన్ గ్లో తో అమలాపాల్ ఇస్తున్న ఫోజులు టెంప్టింగ్ గా ఉన్నాయి. క్షణం కూడా చూపు తిప్పుకోలేని విధంగా అమలాపాల్ మైమరపించే ఫోజులు ఇస్తోంది. 

క్రమంగా అమలా పాల్ హాట్ డోస్ పెంచేస్తోంది. అమలాపాల్ ఈ గ్లామర్ విధ్వంసానికి నెటిజన్లు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. అమలాపాల్ హాట్ నెస్ కి కుర్రాళ్లు చిలిపి కామెంట్స్ పెడుతున్నారు. 

మరికొందరు అయితే ఎక్కువగా బికినీ పిక్స్ పోస్ట్ చేయాలనీ కొంటె కామెంట్స్ చేస్తున్నారు. అమలాపాల్ ప్రస్తుతం థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు ప్రాధాన్యత ఇస్తోంది. అవసరమైనప్పుడు గ్లామర్ కూడా వెదజల్లుతోంది. 

అమలాపాల్ షేర్ చేసిన పిక్స్ అందంగా క్యూట్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఆమె కళ్ళు అయితే ఒక అద్భుతం అనే చెప్పాలి. పెద్ద కళ్ళతో అమలాపాల్ యువతపై ఒక మ్యాజిక్ చేస్తోంది అనే చెప్పాలి. ఆమె చూపుల నుంచి యువత తప్పించుకోవడం కష్టం అనేంతగా అమలాపాల్ బ్యూటిఫుల్ లుక్స్ ఉన్నాయి. 

ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. 

click me!