Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ఇనయాకు పెళ్లైందా..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి ఫోటో!

Published : Dec 14, 2022, 05:30 PM ISTUpdated : Dec 14, 2022, 05:35 PM IST

బిగ్ బాస్ లేడీ టైగర్ ఎవరంటే టక్కున ఇనయా అంటారు. అంతటి పాపులారిటీ ఆమె సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ షోతో లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న ఇనయా ఎప్పుడో మ్యారేజ్ చేసుకున్నారంటూ... ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   

PREV
17
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ఇనయాకు పెళ్లైందా..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి ఫోటో!
Bigg Boss Telugu 6


బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss Telugu 6) లో ఇనయా ఒక సెన్సేషన్. అభిమానులను విపరీతంగా సొంతం చేసుకున్న ఈ బోల్డ్ లేడీ తన గేమ్ తో ఆకట్టుకున్నారు. ఎంత మంది ఎదురున్నా వెరవకుండా పోరాటం చేయడం ఇనయా నైజం. హౌస్ మొత్తం టార్గెట్ చేసినా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా గేమ్ ఆడింది. అది ఆడియన్స్ కి బాగా నచ్చింది. అమ్మాయిల్లో ఆ స్థాయిలో ఆత్మవిశ్వాసం ఉండాలని నిరూపించింది. 
 

27
Bigg Boss Telugu 6

ఫేక్ గేమ్ కి దూరంగా ప్రేమైనా, కోపమైనా , నవ్వైనా ,ఏడుపైనా వెంటనే చూపించేసేది. కంటెస్టెంట్ సూర్య అంటే ఇష్టమని నేరుగా బిగ్ బాస్ కి చెప్పిన ఇనయా.. అతనితో రొమాన్స్ చేసింది. సూర్యను బాగా ఇష్టపడే ఆమె గేమ్ ని సైతం నిర్లక్ష్యం చేసింది. నాగార్జున వార్నింగ్ ఇవ్వడంతో గేమ్ పై ఫోకస్ పెట్టింది.

37
Bigg Boss Telugu 6

స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన ఇనయా(Inaya Sultana) టైటిల్ ఫెవరేట్స్ లో ఒకరిగా ప్రచారం అయ్యారు. అనూహ్యంగా ఆమెను 14వ వారం ఎలిమినేట్ చేశారు. ఆదిరెడ్డి-ఇనయా డేంజర్ జోన్లోకి రావడం జరిగింది. వీరిద్దరిలో తక్కువ ఓట్లు వచ్చిన ఇనయాను ఎలిమినేట్ చేసిన బయటకు పంపారు.
 

47


ఇనయా ఎలిమినేషన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెది ఫేక్ ఎలిమినేషన్ ఇంతటి ప్రజాదరణ ఉన్న కంటెస్టెంట్ ఎలా ఎలిమినేట్ అవుతుంది. ఓట్లతో సంబంధం లేకుండా ఇనయాను ఎలిమినేట్ చేశారంటూ ధ్వజమెత్తారు. మరో ప్రక్క కేవలం ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెబుతున్నారు. 
 

57

మూడు నెలలు బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఇనయా బయటకు వచ్చిన వెంటనే తన క్రష్ సూర్యను కలిసింది. ఇద్దరు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వైరల్ గా మారింది.

67
Bigg Boss Telugu 6

ఇదిలా ఉంటే ఇనయాకు చాలా కాలం క్రితమే పెళ్ళైందని ఒక వాదన మొదలైంది. ఇనయాకు చెందిన ఒక త్రో బ్యాక్ ఫోటో బయటకు రాగా అది ఆమె పెళ్లి ఫోటోనే అంటున్నారు.

77
Bigg Boss Telugu 6

బిగ్ బాస్ తెలుగు 6 అనే పేరున ఉన్న ఒక ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఇనయా త్రోబ్యాక్ ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆమె పెళ్ళికూతురిలా ముస్తాబై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇనయాకు గతంలో పెళ్లి జరిగిందని కొందరు ఊహాగానాలు మొదలుపెట్టారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా ఫోటో చూసి పెళ్లి ప్రచారం చేయడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories