వరుసగా అద్భుతమైన చిత్రాలతో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ నుంచి కోలుకునేందుకు సమంత యుఎస్ లో ట్రీట్మెంట్ తీసుకుంది. దీనితో సమంత చాలా కాలం అభిమానుల నుంచి, సినిమా షూటింగ్స్ నుంచి దూరంగా ఉంటోంది.